Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డం పెంచుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

Webdunia
సోమవారం, 27 మే 2019 (19:23 IST)
ఒకప్పుడు ప్రేమలో విఫలమైన వాళ్ళు గుబురు గడ్డంతో కనిపించేవాళ్లు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. గడ్డం పెంచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్‌తో పాటు దాని వల్ల అనేక లాభాలు ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 
* గడ్డం పెంచుకోవడం వల్ల అనేక చర్మ వ్యాధుల నుంచి దూరం కావొచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
 
* మీకు గడ్డం ఉంటే ముఖం మంచి మాయిశ్చరైజ్‌ను కలిగి ఉండడంతో పాటు యంగ్ అండ్ స్మార్ట్‌లుక్‌తో అందంగా కనిపించేలా చేస్తుంది.
 
* ముఖ్యంగా సూర్యుడి నుంచి విడుదలయ్యే రేడియేషన్ కిరణాలు నేరుగా ముఖంపై పడకుండా ఆపుతుంది. అందువల్ల చర్మం నల్లగా మారడం, సూర్యరశ్మి తగిలి కమిలిపోవడం వంటి సమస్యలు రావు. ముఖంలో ముడతలు రావు. యూవీ కిరణాల నుండి కూడా రక్షణ కలుగుతుంది.
 
* ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియా, టాక్సిన్స్ లోపలికి వెళ్లకుండా గడ్డం నివారిస్తుంది.
 
* క్లీన్ షేవ్ చేసుకున్న ప్రతీసారీ చర్మం మాయిశ్చరైజేషన్ కోల్పోతుంది. దీని వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు, మొటిమలు పెరుగుతాయి. గడ్డం ఉండడం వల్ల ఈ సమస్యలు తలెత్తవు. ముఖంపై మచ్చలు కూడా చాలా వరకూ తగ్గుతాయి.
 
* ప్రస్తుతం అమ్మాయిలు స్మార్ట్‌గా కనిపించే మగాళ్ల కంటే గడ్డంతో కనిపించేవారినే ఎక్కువగా ఇష్టపడతారట.
 
* ఒకప్పుడు ప్రేయసి కాదంటే గడ్డాలు పెంచిన ప్రేమదాసులు కాస్త ప్రేమకి దాసులు కావాలంటే గడ్డాలు పెంచమంటూ సలహాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments