Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే జొన్న, అందుకే వీటిని తినాలి (video)

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (22:19 IST)
ఆరోగ్యంగా వుండాలంటే చిరుధాన్యాలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు చెపుతున్నారు. వీటిలో జొన్నలు ఎంతో బలవర్ధకమైన ఆహారం. జొన్నపిండితో చేసిన రొట్టెలు రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బియ్యం, గోధుమలతో పోలిస్తే జొన్నల్లోనే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్ధాల్లాంటి పోషకాలుకూడా వీటిలో ఎక్కువ. గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం జొన్నల్లో ఉంది. ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. 
 
శరీరంలో ఉండే చెడు కొవ్వు తగ్గించే శక్తి జొన్నగింజల్లో ఉంది. ఎముకలు బలిష్టంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ ఒక కప్పు జొన్నల్లో లభిస్తుంది. నరాల బలహీనతను తగ్గించే గుణం జొన్నలకు ఉంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు జొన్నలు ఎక్కువగా వాడటం వల్ల తగ్గుతాయి. 
 
జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణశక్తిని పెంపొంది, అందుకు అవసరమైన హార్మోన్లను వృద్ధి చేస్తాయి. జొన్నల్లో ఉండే పోషకాలు, తల్లికే కాదు.. బిడ్డకు మంచిదే. కాబట్టి పాలిచ్చే తల్లులకు జొన్నలతో చేసిన ఆహారం పెట్టడం మంచిది.
 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments