Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోలీకి ఆరోగ్యకరమైన ట్విస్ట్ జోడించండి: బాదంపప్పును మీ పండుగ స్నాక్‌గా చేసుకోండి

సిహెచ్
సోమవారం, 25 మార్చి 2024 (18:24 IST)
ఉత్సాహభరితంగా, రంగులతో జరుపుకునే ఆనందకరమైన పండుగ, హోలీ. ఈ పండుగ సందర్భంగా, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రియమైన వారితో రుచికరమైన భోజనం చేయడం సంప్రదాయం. అయినప్పటికీ, పండుగల వేళ, అనారోగ్యకరమైన స్నాక్స్, ఆహారాలలో అతిగా తినకుండా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. అందువల్ల, హోలీని వేడుక చేసుకునేటప్పుడు మైండ్‌ఫుల్‌నెస్‌ని ఆచరించడం అత్యవసరం. ఈ సమయంలో మీ ఆహారంలో కొన్ని బాదంపప్పులను చేర్చుకోవడం రుచిని మెరుగుపరచడంతోపాటు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 
 
విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, రిబోఫ్లావిన్, జింక్ వంటి 15 ముఖ్యమైన పోషకాల మూలం బాదం, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం, బరువును నిర్వహించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను అందించే సామర్థ్యానికి ఇది ప్రసిద్ధి చెందింది. ఈ పవర్‌హౌస్ గింజలను హోలీ వేడుకల్లో చేర్చడం ఉత్తమమైన మార్గం. బహుమతిగా ఇచ్చినా, సాంప్రదాయ వంటకాలలో చేర్చబడినా లేదా స్నాక్స్‌గా ఆనందించినా, బాదం శ్రేయస్సును సూచిస్తుంది. అంతేకాకుండా, బాదంపప్పును బహుమతిగా ఇవ్వడం ఆరోగ్యం, సంతోషం కోసం శుభాకాంక్షలను తెలియజేస్తుంది.
 
బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ హోలీ వేడుకపై మాట్లాడుతూ, “అందరిలాగే, నాకు ఇష్టమైన వారితో హోలీ జరుపుకోవడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. ఇంట్లో హోలీ పార్టీలను నిర్వహించడం నాకు చాలా ఇష్టం. ఒక సంప్రదాయంగా, నేను ఎల్లప్పుడూ నా కుటుంబం కోసం ఆల్మండ్ బ్రిట్ట్లే తయారుచేస్తాను, ఇది రుచి, పోషణ యొక్క సంతోషకరమైన కలయిక. ఈ డెజర్ట్ పండుగ యొక్క మా ఆనందాన్ని మెరుగుపరచడమే కాకుండా తీపి  విందులకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని అందించడం ద్వారా ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది" అని అన్నారు.
 
ఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్ రీజినల్ హెడ్-డైటీటిక్స్ రితికా సమద్దర్ మాట్లాడుతూ, “హోలీ వేడుకల సమయంలో, స్నాక్స్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం మన ఆరోగ్యంపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. అనారోగ్యకరమైన స్నాక్స్‌కు బదులుగా బాదం వంటి పోషకమైన ఎంపికలను ఎంచుకోవడం పండుగ స్ఫూర్తిని పెంచడమే కాకుండా మన శ్రేయస్సును కూడా పెంచుతుంది. మంచి కొవ్వులు, మాంసకృత్తులతో నిండిన బాదం పప్పులు, బరువు తగ్గించే భోజన ప్రణాళికకు ఆదర్శవంతమైన జోడింపుగా ఉంటాయి. అంతేకాకుండా, మన రోజువారీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాద కారకం అయిన డైస్లిపిడెమియాను తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మన హోలీ సంబరాలలో బాదంపప్పును చేర్చడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది" అని అన్నారు.
 
హోలీ సమయంలో చర్మ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే దాని గురించి స్కిన్ ఎక్స్‌పర్ట్, కాస్మోటాలజిస్ట్ డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా మాట్లాడుతూ, “హోలీ పండుగ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే దాని ప్రకాశవంతమైన రంగులు చర్మానికి హాని కలిగిస్తాయి. పండుగలో ఉపయోగించే సింథటిక్ రంగులు తరచుగా కఠినమైన రసాయనాలను కలిగి ఉంటాయి. నా సలహా ఏమిటంటే, సెలబ్రేషన్‌ల తర్వాత చర్మాన్ని తేలికపాటి, హైడ్రేటింగ్ క్లీన్సర్‌తో సున్నితంగా శుభ్రపరచడం, చర్మాన్ని పూర్తిగా మాయిశ్చరైజ్ చేయాలని, పుష్కలంగా నీరు త్రాగాలని నేను సిఫార్సు చేస్తున్నాను. ఇంకా, నేను కొన్ని బాదంపప్పులను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నాను" అని అన్నారు.
 
షీలా కృష్ణస్వామి, న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ మాట్లాడుతూ, “పండుగలు, ప్రత్యేక సందర్భాలలో బాదం ఒక అర్ధవంతమైన, శుభప్రదమైన బహుమతిగా ఉపయోగపడుతుంది. బాదంపప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఎందుకంటే అవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి" అని అన్నారు. 
 
ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్- సెలబ్రిటీ మాస్టర్ ఇన్‌స్ట్రక్టర్, యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ, “హృదయ ఆరోగ్యాన్ని, మొత్తం శ్రేయస్సును నిర్వహించడానికి బాదం తోడ్పడుతుంది. హోలీ వేడుకల్లో బాదంపప్పును చేర్చడం చాలా సులభం- రుచిలో రాజీ పడకుండా పోషకమైన బూస్ట్ కోసం వాటిని సొంతంగా ఆస్వాదించవచ్చు లేదా స్వీట్లు, సలాడ్‌లు లేదా పెరుగు డిప్స్ వంటి వంటకాలకు జోడించవచ్చు. బాదంపప్పులతో మీ శరీరాన్ని పోషించుకుంటూ హోలీ పండుగ స్ఫూర్తిని స్వీకరించండి" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

తర్వాతి కథనం
Show comments