Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

గోవింద ద్వాదశి 2024: శ్రీ నరసింహ స్వామిని పూజించాలి.. ఎందుకు?

Advertiesment
Govind Dwadashi 2024: Significance and Rituals

సెల్వి

, బుధవారం, 20 మార్చి 2024 (19:30 IST)
ఫాల్గుణ శుక్ల పక్షంలోని 12వ రోజున గోవింద ద్వాదశి పవిత్రమైన రోజున నరసింహ స్వామిని పూజించడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయి. ఈ గోవింద ద్వాదశి మార్చి 21న వస్తోంది. ఈ గోవింద ద్వాదశి హోలికి నాలుగు రోజుల ముందు వస్తుంది. 
 
గోవింద ద్వాదశి రోజున నరసింహ స్వామితో పాటు శ్రీకృష్ణుడిని ఆరాధించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున శ్రీకృష్ణ ఆరాధనతో జీవితంలో అన్ని రకాల ప్రతికూలతలను తొలగించుకోవచ్చు. గోవింద ద్వాదశి రోజున దేశంలోని సుప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. 
 
పూరీ జగన్నాథ్, తిరుమల శ్రీవారి ఆలయం గోవిందునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. గోవింద ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. విష్ణు సాయుజ్యం చేకూరుతుంది. గోవింద ద్వాదశి రోజున హిరణ్యకశిపుడిని వధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-03-2024 బుధవారం దినఫలాలు - విరాళాలు ఇవ్వటం వలన మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి...