Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనుమాన్ జయంతి.. హనుమాన్ చాలీసా పఠనం.. నేతి దీపం వెలిగిస్తే..?

Advertiesment
Hanuman Jayanti 2023
, బుధవారం, 5 ఏప్రియల్ 2023 (21:59 IST)
హనుమాన్ జయంతి ఈ సంవత్సరం ఏప్రిల్ 6, 2023న వస్తుంది. హనుమంతుడు శ్రీరామునికి నమ్మిన బంటు. శక్తి, నిస్వార్థ సేవ, వినయం, భక్తి, విధేయతకు చిహ్నంగా హనుమంతుడిని పరిగణించబడతారు. హనుమంతుడు రాముడి పట్ల అపారమైన భక్తికి ప్రసిద్ధి చెందాడు. ఇతిహాసం రామాయణంలో కీలక పాత్ర పోషించాడు. అతను గొప్ప శారీరక బలం, అతీంద్రియ శక్తులను కలిగి ఉంటాడని కూడా విశ్వాసం.  
 
హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండి ఇంట్లో ప్రత్యేక ప్రార్థనలు చేయడం మంచిది. హనుమాన్ జయంతి రోజున నేతి, నువ్వుల నూనె దీపాలను వెలిగించడం ద్వారా సర్వ సుఖాలు చేకూరుతాయి. ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో అడ్డంకులను అధిగమించి విజయం, శ్రేయస్సు పొందవచ్చని నమ్ముతారు.
 
1. పూజ గదిని శుభ్రం చేసి పువ్వులు మరియు రంగోలితో అలంకరించండి.
2. శుభ్రమైన పీటపై హనుమంతుని చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచండి.
3. హనుమంతునికి పువ్వులు, పండ్లు, స్వీట్లను సమర్పించండి 
4. నేతి దీపాన్ని వెలిగించడం మరిచిపోవద్దు.
5. హనుమాన్ చాలీసా మరియు హనుమాన్ అష్టకం వంటి ఇతర హనుమాన్ మంత్రాలను పఠించండి.
5. కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వండి. 
6. హనుమంతునికి ప్రసాదాన్ని సమర్పించి భక్తులకు పంచండి.
7. చివరగా, హనుమంతుని దీవెనలు కోరండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-04-2023 తేదీ బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...