కాలం కలిసిరానప్పుడు.. ఏ కార్యాన్ని ప్రారంభించినా విఘ్నాలు వస్తుంటే సంకష్టహర చతుర్థి నాడు విఘ్నేశ్వరుడిని పూజించడం మేలు చేస్తుంది. సంకటహర చతుర్థి రోజు సాయంత్ర సమయమందు విఘ్నేశ్వరుని సంకటహర చతుర్థి వ్రత కల్పము ద్వారా పూజ చేయాలి.
అలాగే సంకట నాశన గణేశ స్తోత్రాన్ని పఠించినట్లైతే కష్టాలు తొలగి శుభ ఫలితములు కలుగుతాయి. విఘ్నేశ్వరుని గరికతో పూజించుట వలన శుభఫలితాలు కలుగుతాయి.
ఈరోజు వ్రతమాచరించే భక్తులు పండ్లు, పాలు మొదలైన వాటితో చేసిన వస్తువులను తింటారు. అంతేకాదు ఈరోజు వారు బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంది. మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.