Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఆరోగ్యకరమైన జీవనం: విటమిన్ సి పాత్ర’పై అబాట్ సర్వే

ఐవీఆర్
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (21:15 IST)
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. మహమ్మారి త ర్వాత జీవనశైలిలో మార్పులు చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రజల అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య అవసరాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, ఐపిఎస్ఓఎస్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ ఆరోగ్యసంరక్షణ కంపెనీ అయిన అబాట్, తన దేశవ్యాప్త సర్వే, ‘హెల్తీ లివింగ్: ది రోల్ ఆఫ్ విటమిన్ సి.’ యొక్క ఫలితాలను వెల్లడించింది.
 
10 మంది వినియోగదారులలో దాదాపు 7 మంది రోగనిరోధక శక్తి, అధిక శక్తి స్థాయిలు, రోజువారీ కార్య కలాపాలను ఇబ్బంది లేకుండా చేసుకోగలగడంతో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారని ఈ సర్వే చాటి చెప్పింది. చాలామంది ప్రజలు మెరుగైన ఆరోగ్య ఫలితాల కోసం తగినంత స్థాయిలో విటమిన్ సిని తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. విటమిన్ సి అనేది అనేక శరీర విధులను నిర్వహించడానికి అవసరమైన సూక్ష్మ పోషకం, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ప్రజలు తమ రోజువారీ దినచర్యలో విటమిన్ సిని ఎలా గ్రహిస్తారు, ఎలా చేర్చుకుంటారు అనే దానిపై ఈ అధ్యయనాలు వివిధ దృక్పథాలను వెలికి తీశాయి.
 
అబాట్ ఇండియా మెడికల్ అఫైర్స్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కార్తిక్ పీతాంబరన్ మాట్లాడుతూ, ‘‘విటమిన్ సి శరీరం యొక్క రోగనిరోధక రక్షణ యంత్రాంగానికి దోహదం చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి సప్లిమెంట్ తీసుకోవడం శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లను నివారించడం, నయం చేయడం తెలిసిందే. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యంలో విటమిన్ సి పాత్రపై అవగాహనను మా సర్వే చాటిచెబుతుంది’’ అని అన్నారు.
 
"విటమిన్ సి శరీర రక్షణ, ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం, ఐరన్ శోషణను మెరుగుపరచడం, గాయం నయం చేయడం, ఆరోగ్యకరమైన చిగుళ్ల నిర్వహణ వంటి మరిన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. విటమిన్ సి లేకపోవడం పోషకాహార అంతరానికి దారి తీస్తుంది" అని హైదరాబాద్‌లోని ప్రజ్వల హాస్పిటల్ కన్సల్టింగ్ ఫిజిషియన్ డాక్టర్ యు విక్టర్ ఇమ్మాన్యుయేల్ అన్నారు. "విటమిన్ సిసుస్థిరమైన వినియోగం రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా, మధుమేహం వంటి సాంక్రమితేర వ్యాధులు ఉన్న వారికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. వారు ఎక్కువ తీసుకోవడం అవసరం కావచ్చు" అని అన్నారు.
 
'ఆరోగ్యకరమైన జీవనం: విటమిన్ సి పాత్ర' సర్వే
ముంబై, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కొచ్చిన్, అహ్మదాబాద్, పుణె అనే తొమ్మిది నగరాల్లో 2,000 మంది వ్యక్తులను Ipsos సర్వే చేసింది. కొన్ని కీలక ఫలితాలు:
 
గమనించిన ప్రయోజనాలు
వర్షాకాలం, చలికాలంలో విటమిన్ సి సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల అనారోగ్యం గా ఉండే రోజులు తగ్గుతాయని సర్వేలో పాల్గొన్న వారిలో 52% మంది  చెప్పారు.
 
61% మంది మహిళలు అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవడానికి విటమిన్ సి ప్రయోజనకరంగా ఉన్నట్లు గుర్తించారు
 
గ్రహించిన ప్రయోజనాలు:
సర్వేలో పాల్గొన్న వారిలో 60% మంది (50% నాన్-సప్లిమెంట్ వినియోగదారులతో సహా) అనారోగ్యం నుండి కోలుకోవడంలో విటమిన్ సి సప్లిమెంట్లతో అనుబంధం కలిగి ఉన్నారు.
 
విటమిన్ సప్లిమెంట్లు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయని 65% మంది గ్రహించారు. ఎముక, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడు తుందని 52% మంది అభిప్రాయపడ్డారు.
 
అనారోగ్యాల నుండి త్వరగా కోలుకోవడానికి తగినంత నీరు, సమతుల్య ఆహారం తీసుకోవాలని 73% మంది భావించారు.
 
తక్కువ విటమిన్ సి తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలు:
విటమిన్ సి లేకపోవడం రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని 60% మంది నమ్ముతారు.
తక్కువ విటమిన్ సి తీసుకోవడం వల్ల అనారోగ్యాల నుండి కోలుకోవడంలో ఆలస్యం అవుతుందని 36% మంది విశ్వసిస్తారు.
 
డాక్టర్ యు విక్టర్ ఇమ్మాన్యుయేల్ ఇంకా ఇలా అన్నారు, ‘‘ఈ అధ్యయనాలు విటమిన్ సి, రోగ నిరోధక పనితీరుకు అది మద్దతు ఇవ్వడంలో, ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో దాని పాత్రపై పరిశోధన అధ్యయనాలకు అనుగుణంగా ఉన్నాయి. ‘విటమిన్ సి’ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం బలమైన రోగ నిరోధక వ్యవస్థను నిర్మించడం ద్వారా ప్రజలు ఆరోగ్యం పొందడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.’’

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

తర్వాతి కథనం
Show comments