విటమిన్ సి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చాలా పండ్లు, కూరగాయలలో లభిస్తుంది.
విటమిన్ సి వల్ల దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదం రాకుండా అడ్డుకోవచ్చు.
అధిక రక్తపోటును అదుపు చేయడంలో విటమిన్ సి సహాయపడవచ్చు.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించవచ్చు, గౌట్ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.
ఇనుము లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది
విటమిన్ సితో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
వయసు పెరిగే కొద్దీ మీ జ్ఞాపకశక్తిని, ఆలోచనలను కాపాడుతుంది.
సాధారణ జలుబును నివారించే శక్తి విటమిన్ సికి వుంది.