Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతీయ బాదం దినోత్సవం: మెరిసే చర్మం, మధుమేహ నియంత్రణ, ఆరోగ్యకరమైన గుండె కోసం బాదంపప్పులు

Advertiesment
National Almond Day

సిహెచ్

, శుక్రవారం, 19 జనవరి 2024 (17:30 IST)
బాదంపప్పుతో తమ రోజును ప్రారంభించే దీర్ఘకాల సంప్రదాయం భారతదేశంలో ఉంది. మన తల్లులు, అమ్మమ్మలు మన రోజువారీ ఆహారంలో బాదంను చేర్చడం యొక్క ప్రాముఖ్యతపై నొక్కిచెప్పారు. బాదములో విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ వంటి 15 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి, ఇవి సంపూర్ణ ఆరోగ్యం నిర్వహించడానికి కీలకమైనవి. బాదంపప్పు తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి, ప్రతి సంవత్సరం జనవరి 23న జాతీయ బాదం దినోత్సవంగా జరుపుకుంటారు. బాదంపప్పును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం, ఒకరి రోజువారీ ఆహారంలో కొన్ని బాదంలను చేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం దీని లక్ష్యం. ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా ఈ నేషనల్ ఆల్మండ్ డేని ఒక ప్రచారం ద్వారా 23 బాదంపప్పులను తీసుకోవటం యొక్క ఆవశ్యకత తెలుపుతూనే, ఈ గింజలు అందించే అనేక ఆరోగ్య ప్రయోజనాలను నొక్కి చెబుతుంది.  
 
ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులు లేదా 23 బాదంపప్పులను తీసుకోవడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలు:
 
డయాబెటిస్ నిర్వహణ: బాదంలో ప్రోటీన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి ఇవి దోహదం చేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
 
చర్మ ఆరోగ్యం: బాదంపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ కు మూలం, ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఏజింగ్ లక్షణాలను ఇస్తాయని తేలింది.
 
గుండె ఆరోగ్యం: ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల టోటల్, LDL కొలెస్ట్రాల్ స్థాయిలు రెండింటినీ తగ్గించుకోవచ్చు
 
కండరాల పునరుద్ధరణ: బాదంపప్పును తీసుకోవడం వల్ల వ్యాయామం తర్వాత అలసట, టెన్షన్ తగ్గడంతో పాటుగా కోలుకునే సమయంలో కండరాల నష్టం తగ్గడం కూడా జరుగుతుంది.
 
బరువు నిర్వహణ: బాదంపప్పులు సంతృప్తికరమైన లక్షణాలను కలిగి ఉండటం వల్ల భోజనం మధ్య ఆకలిని దూరం చేస్తాయి.
 
గట్ హెల్త్: బాదం పప్పుల వినియోగం ఆరోగ్యవంతమైన వ్యక్తుల ప్రేగులలో బ్యూటిరేట్ స్థాయిలను పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కీలకమైనది.
 
బాదంపప్పుల పట్ల తనకున్న ప్రేమను తెలియజేసిన బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ, “నా దినచర్యలో కొన్ని బాదంపప్పులను చేర్చడమనేది కేవలం వ్యక్తిగత ఆరోగ్య ఎంపిక మాత్రమే కాదు; నా కుటుంబ ఆరోగ్యం పట్ల నా నిబద్ధత. మా రోజువారీ ఆహారంలో బాదంపప్పు ఉండేలా చూసుకుంటాను" అని అన్నారు. 
 
దక్షిణ భారత చలనచిత్ర & టెలివిజన్ నటి వాణి భోజన్ మాట్లాడుతూ, “నా ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ బిజీ షెడ్యూల్‌ను బ్యాలన్స్ చేసుకోవడం నాకు చాలా కీలకం. నేను చిరుతిండిని తినాలని కోరుకున్నప్పుడు, బాదం వంటి ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకుంటాను" అని అన్నారు. 
 
ప్రఖ్యాత కన్నడ నటి, ప్రణిత సుభాష్ మాట్లాడుతూ, “నటిగా, ప్రకాశవంతమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడం నాకు చాలా ముఖ్యం. దినచర్యలో బాదంపప్పులను చేర్చుకోవడం వల్ల కలిగే విశేషమైన ప్రయోజనాలను నేను చూసాను" అని అన్నారు. 
 
చర్మ నిపుణులు, కాస్మోటాలజిస్ట్ డాక్టర్ గీతికా మిట్టల్ మాట్లాడుతూ, "మీ చర్మంను UV కిరణాల నుండి బాదం రక్షించగలదు. మీ మొత్తం చర్మ ఆరోగ్యాన్ని బాదం మెరుగుపరుస్తుంది" అని అన్నారు. 
 
పోషకాహార నిపుణులు రోహిణి పాటిల్, MBBS మాట్లాడుతూ, “ సాధారణ స్నాక్స్‌కు ప్రత్యామ్నాయంగా బాదంపప్పును తీసుకోవడం వల్ల మధుమేహాన్ని నివారించవచ్చు, ముఖ్యంగా యువకులలో.." అని అన్నారు. న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, “బాదం ఒక పోషకాహార శక్తి కేంద్రంగా ఉంది, వాటి వైవిధ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను హైలైట్ చేస్తూ విస్తృతమైన పరిశోధనలు వున్నాయి. ఇవి కొలెస్ట్రాల్, గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో, అలాగే బరువు నిర్వహణలో సహాయపడతాయి" అని అన్నారు. 
 
రీజనల్ హెడ్-డైటెటిక్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఢిల్లీ, రితికా సమద్దర్ మాట్లాడుతూ, “బాదంలో విటమిన్ B2, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఆహారం నుండి శక్తిని విడుదల చేయడంలో ఇవి కీలకమైనవి. ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తీసుకోవడం వల్ల చురుకుగా ఉండవచ్చు" అని అన్నారు. ఆయుర్వేద నిపుణురాలు మధుమితా కృష్ణన్ మాట్లాడుతూ, “ఆయుర్వేదం ప్రకారం, బాదం, నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది, బలాన్ని పెంచుతుంది, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఒకరి రోజువారీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకోవడం శరీరంలోని జీవశక్తి, సమతుల్యతకు దోహదం చేస్తుంది" అని అన్నారు.
 
బాదం యొక్క ప్రయోజనాల గురించి ఫిట్‌నెస్ నిపుణులు, సెలబ్రిటీ మాస్టర్ ఇన్‌స్ట్రక్టర్, యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ, “బాదంపప్పులను అల్పాహారం తీసుకోవడం వల్ల వ్యాయామం చేసిన తర్వాత త్వరగా కోలుకోవడంతోపాటు అలసట, టెన్షన్‌ను తగ్గించవచ్చని ఒక అధ్యయనం సూచిస్తుంది. నేను వ్యక్తిగతంగా నా డైట్‌లో బాదంపప్పులు ఉండేలా చూసుకుంటాను, నా క్లయింట్‌లకు కూడా అదే సిఫార్సు చేస్తున్నాను" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు తప్పకుండా సూర్య నమస్కారం చేయాలట..!