చర్మాన్ని అందంగా వుంచుకోవాలంటే ఈ ఆహారాన్ని తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆ ఆహారం ఏంటో చూద్దాం.. రోజూ ఒక గుడ్డు తింటే చర్మానికి మంచిది. పండ్ల రసాలను ఎక్కువగా తాగితే, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది.
నానబెట్టిన బాదం నుంచి తెల్లవారుజామున తీసుకుంటే చర్మం పొడిబారడాన్ని నిరోధిస్తుంది. వారానికి ఒకసారి కొబ్బరి నూనె నూనెతో శరీరం అంతటా మసాజ్ చేసి స్నానం చేయడం చర్మాన్ని మెరుగ్గా వుంచుతుంది.
నిమ్మకాయ, పసుపును ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. వీటితో పాటు బొప్పాయి, జామకాయ, అరటిపండు, యాపిల్ వంటి పండ్లను తింటే చర్మం ఆరోగ్యానికి మంచిది. తరచుగా నీరు త్రాగుట వలన చర్మంలో ముడతలు ఏర్పడవు. విటమిన్ సి పుష్కలంగా వుండే నిమ్మరసం, ఉసిరికాయలను తీసుకుంటే చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుకోవచ్చు.