Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీలు చెడిపోతున్నాయి అని తెలిపే సంకేతాలు ఎలా వుంటాయి

Webdunia
మంగళవారం, 23 మే 2023 (20:32 IST)
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్‌లానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వుంటాయో తెలుసుకుందాము.
 
మూత్రవిసర్జనకు కిడ్నీలకు సంబంధం ఉన్నది, కనుక మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి, దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది.
 
కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం, వాంతులు వస్తాయి. రక్తంలో వ్యర్థాల ఫలితంగా ఇది జరుగుతుంది. కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తిపై ప్రభావం చూపి అలసట, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కిడ్నీలు ఉండే వీపు భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది, ఇది కిడ్నీలు చెడిపోయినప్పుడు కనపడే సాధారణ సంకేతం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

తర్వాతి కథనం
Show comments