Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 గంటల కన్నా ఎక్కువగా నిద్రిస్తే.. ఏమవుతుందో తెలుసా..?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (10:12 IST)
ప్రతి ఒక్కరికి జీవితంలో నిద్ర అనేది ఎంతో ముఖ్యమైనది. చాలామంది నిద్రలేమి కారణంగా రకరకాల అనారోగ్యాల పాలవుతున్నారు. రోజూ తప్పకుండా 8 గంటల పాటు నిద్రించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ 8 గంటల పాటు నిద్రించడం వలన శరీరం పునరుత్తేజం చెందుతుంది. శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. కనుక నిత్యం 6 నుండి 8 గంటల పాట నిద్రపోవాలని వైద్యులు చెప్తున్నారు.
 
కానీ, కొందరు ఈ సమయాన్ని పాటించరు. చాలా తక్కువ గంటలు నిద్రిస్తుంటారు. ఇక మరికొందరైతే ఏకంగా 10 గంటలకు పైగా నిద్రిస్తుంటారు. అసలు నిజం చెప్పాలంటే.. ఒక మనిషికి నిద్ర తక్కువైతే ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారో అదేవిధంగా నిద్ర ఎక్కువైతే కూడా అలాంటి సమస్యలే ఎదుర్కుంటారని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. 
 
నిత్యం 10 గంటల పాటు నిద్రించిన వారికి మధుమేహం, స్థూలకాయం, తలనొప్పి, వెన్నునొప్పి, గుండె వ్యాధులు వంటి పలురకాల వ్యాధులకు గురికావలసి వస్తుంది. 8 గంటలు నిద్రించే వారికంటే.. 10 గంటల నిద్రించే వారికే అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనంలో తేల్చి చెప్పారు. కనుక వీలైనంత వరకు నిద్రించే సమయాన్ని 10 గంటల కన్నా తక్కువగా ఉండేలా అలవాటు చేసుకోవాలి. లేదంటే పైన చెప్పిన వ్యాధులకు తప్పక గురికావలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్త వహించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం
Show comments