Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్ట్ ఎటాక్ వచ్చేముందు కనిపించే లక్షణాలు... ఎలా ఉంటాయి...?

హార్ట్ ఎటాక్‌. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది దీని బారిన ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద వారిలో మాత్ర‌మే క‌నిపించిన గుండె జ‌బ్బులు ఇప్పుడు యుక్త వ‌య‌స్సు వారిలోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కార‌ణాలు ఏమున్నా ఇప్పుడు హార్ట్ ఎటాక్స్ అనేవి అన్ని

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (15:35 IST)
హార్ట్ ఎటాక్‌. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది దీని బారిన ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద వారిలో మాత్ర‌మే క‌నిపించిన గుండె జ‌బ్బులు ఇప్పుడు యుక్త వ‌య‌స్సు వారిలోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కార‌ణాలు ఏమున్నా ఇప్పుడు హార్ట్ ఎటాక్స్ అనేవి అన్ని దేశాల్లోనూ ఎక్కువైపోయాయి. కొంతమందికి హార్ట్ ఎటాక్ గురించిన పూర్తి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల అది మొద‌టిసారి వ‌చ్చిన‌ప్పుడు జ‌ర‌గాల్సిన న‌ష్టం అంతా జ‌రిగిపోతోంది. ఈ క్ర‌మంలో హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికీ ఉంది. దీనిపై అవగాహన కలిగి ఉండటం వ‌ల్ల ఎంతో విలువైన మ‌న ప్రాణాల‌ను కాపాడుకునేందుకు వీలుంటుంది.
 
జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌ర‌చుగా వ‌స్తున్నా, అవి ఓ ప‌ట్టాన త‌గ్గ‌కున్నా అనుమానించాల్సిందే. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా నిలుస్తాయి. దీంతోపాటు ద‌గ్గు కూడా ఎక్కువ‌గా వ‌స్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్‌కు చిహ్నంగా అనుమానించాలి. ఛాతిలో అసౌక‌ర్యంగా ఉంటున్నా, ఏదో బ‌రువుగా ఛాతిపై పెట్టిన‌ట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచ‌నే అవుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఆలోచించ‌కూడ‌దు. వైద్యున్ని సంప్ర‌దించి త‌క్ష‌ణ‌మే త‌గిన చికిత్స చేయించుకోవాలి. 
 
హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన ల‌క్ష‌ణాల్లో మ‌రొక‌టి శ్వాస ఆడ‌క‌పోవ‌డం. గాలి పీల్చుకోవ‌డంలో త‌ర‌చూ ఇబ్బందులు వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి. విప‌రీతంగా అల‌సిపోవ‌డం, ఒళ్లంతా నొప్పులుగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు త‌ర‌చూ క‌నిపిస్తుంటే వాటిని అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. ఎందుకంటే అవి కూడా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌న‌డానికి సూచిక‌లుగా ప‌నిచేస్తాయి. మ‌త్తుగా నిద్ర వ‌చ్చిన‌ట్టు ఉంటున్నా, చెమ‌ట‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నా అనుమానించాల్సిందే. అవి కూడా హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. 
 
కంటి చివ‌ర్ల‌లో కురుపుల వంటివి వ‌స్తే వాటిని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. ఎందుకంటే అవి హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణాలు అయి ఉండ‌వ‌చ్చు. ఎల్ల‌ప్పుడూ వికారంగా తిప్పిన‌ట్టు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ‌క‌పోతున్నా, గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌ర‌చూ వ‌స్తున్నా, క‌డుపు నొప్పి వ‌స్తున్నా వాటిని కూడా హార్ట్ ఎటాక్ వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలుగానే భావించాలి. శ‌రీరం పైభాగం నుంచి ఎడ‌మ చేతి కిందిగా నొప్పి వ‌స్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ ల‌క్ష‌ణంగా అనుమానించాలి. ఒక్కోసారి ద‌వ‌డ‌ల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించ‌వ‌చ్చు. కాళ్లు, పాదాలు, మ‌డిమ‌లు అన్నీ ఉబ్బిపోయి క‌నిపిస్తే వాటిని హార్ట్ ఎటాక్‌కు సూచ‌న‌లుగా భావించాలి. గుండె సంబంధ స‌మ‌స్య‌లు ఉంటే గుండె కొట్టుకోవ‌డం కూడా అసాధార‌ణ రీతిలో ఉంటుంది. కాబ‌ట్టి హార్ట్ బీట్‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూనే ఉండాలి. అందులో ఏదైనా అసాధార‌ణ బీట్ క‌నిపిస్తే వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments