Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

సిహెచ్
బుధవారం, 24 ఏప్రియల్ 2024 (20:45 IST)
అధిక రక్తపోటు పైకి ఎలాంటి లక్షణాలు లేకుండనే లోలోపల తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది.
 
అధిక రక్తపోటు మూలంగా కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని కంటిచూపు తగ్గిపోవచ్చు.
 
గుండె మరింత బలంగా పనిచేయాల్సి రావటం వల్ల గుండె పెద్దగా అవ్వచ్చు. దీంతో శరీరానికి తగినంత రక్తాన్ని సరఫరా చేయలేక గుండె చేతులెత్తేయొచ్చు.
 
రక్తనాళాల్లో పూడికలు తలెత్తటం వల్ల కాళ్లకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు నొప్పి, నీరసం తలెత్తొచ్చు. 
 
మెదడులోని రక్తనాళాలు దెబ్బతినొచ్చు. బలహీనపడొచ్చు. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడొచ్చు, చిట్లిపోయి రక్తం లీక్ కావొచ్చు. ఫలితంగా పక్షవాతం ముంచుకురావొచ్చు.
 
రక్తనాళాల లోపలి మార్గం కుంచించుకుపోవటం వల్ల జననాంగాలకు రక్త సరఫరా తగ్గుతుంది.
 
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతిని లోపలి మార్గం మూసుకుపోవచ్చు. దీంతో గుండె కండరానికి రక్తసరఫరా తగ్గి గుండెపోటు రావొచ్చు.
 
మూత్రపిండాల చుట్టురా ఉండే రక్తనాళాలు దెబ్బతినటం వల్ల రక్తాన్ని వడపోసే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. చివరికి కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది.
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments