Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

అధిక రక్తపోటును అదుపు చేసే పండ్లు

Advertiesment
Fruits that control high blood pressure

సిహెచ్

, మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (18:08 IST)
అధిక రక్తపోటు. ఇది ఆరోగ్యాన్ని సమస్యల్లో పడవేస్తుంది. అందువల్ల దీన్ని అదుపుచేయాలి. పండ్లు, వాటి అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటివి అధిక రక్తపోటుతో సహా హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో, నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
పుల్లని పండ్లు: వీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా వున్నందున అధిక రక్తపోటు ఉన్నవారికి అద్భుతమైనవి.
 
బెర్రీలు: బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు, పాలీఫెనాల్స్‌తో నిండి ఉంటాయి, ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.
 
అరటిపండ్లు: వీటిలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నందున అధిక రక్తపోటును అదుపు చేస్తాయి.
 
దానిమ్మ: దానిమ్మలోని పోషకాలు రక్తపోటు, రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
 
ప్రూనే: వీటిలోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటును తగ్గిస్తుంది, రక్త నాళాలు గట్టిపడకుండా చేస్తుంది.
 
పుచ్చకాయలు: ఇవి అధిక మొత్తంలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, ఫైబర్‌ను అందిస్తాయి, ఇవి రక్తపోటును నిర్వహించడంలో సహాయపడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్రవరి 20న, మిస్సింగ్ డే.. మనతో లేని ప్రియమైన వారిని?