Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ వయసు మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వస్తుంది? లక్షణాలు ఏమిటి?

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (19:23 IST)
మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ కొంతమందికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రతి సంవత్సరం రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల్లో 80% మంది 45 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు వ్యాధిగ్రస్తుల జాబితాలో వుంటున్నారు.

 
అలాగే 43% మంది 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారుగా వుంటున్నారు. 40 నుండి 50 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో, 69 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. 50 నుండి 60 సంవత్సరాల వయస్సు వరకు, ఆ ప్రమాదం 43 మందిలో ఒకరికి పెరుగుతుంది. కనుక 40 ఏళ్లు దాటిన తర్వాత దీని గురించి పరీక్షలు చేయించుకుంటూ వుండాలి. మహిళలు రజస్వల అయిన అనంతరం నెలకు రెండుసార్లు చొప్పున తమ వక్షోజాలను పరిశీలిస్తూ వుండాలి.

 
రొమ్ము కేన్సర్ లక్షణాలు ఏమిటి?
వక్షోజంపై ప్రత్యేకించి ఒక ప్రదేశంలో చర్మం రంగు మారిందా?
చనుమొన నుంచి రక్తం స్రవిస్తోందా?
వక్షోజంలో అల్సర్‌ ఉందా?
వక్షోజం రంగు పాలిపోయిన నారింజ రంగులోకి మారిందా?
వక్షోజం ఒకవైపు నుంచి మరోవైపుకు కదులుతోందా? లేదా?
వక్షోజంలో గడ్డలు, కణుతులు వంటివి ఉన్నాయా?
ఒకవేళ ఏమైనా గడ్డవుంటే, దానిపై చర్మం కదులుతోందా? గట్టిగా కదలకుండా ఉందా?
గొంతు, మెడ, చంకల వద్ద ఏమైనా గడ్డలుగాని కణుతులుగాని ఉన్నాయా?
నొప్పిగా ఉందా?
 
ఈ అంశాలలో ఏ ఒక్కటి గుర్తించినా వెంటనే కేన్సర్‌ స్పెషలిస్టును సంప్రదించండం తప్పనిసరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments