Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

సిహెచ్
మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (15:35 IST)
మధుమేహం, గుండె ఆరోగ్యం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని తరచుగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంటుంది. ఇది ఆయా వ్యక్తుల మొత్తం శ్రేయస్సుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, ఆ ప్రభావం గ్లూకోజ్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇది గుండె పనితీరును, మొత్తం కార్డియో వాస్క్యులర్ (హృదయనాళ) ప్రమాదాన్ని ప్రభావితం చేసే తరంగ ప్రభావం.
 
పరిశోధనల ప్రకారం, మధుమేహం ఉన్న వ్యక్తులకు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల రక్త నాళాలు, గుండె పనితీరును నియంత్రించే నరాలకు హాని కలుగుతుంది. శుభవార్త ఏమిటంటే, మీ మధుమేహాన్ని నిర్వహించడానికి మీరు తీసుకునే చర్యలు మీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
 
జూబ్లీ హిల్స్ హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ సంజీవ్ ఖుల్బే(సీటీవీఎస్) మాట్లాడుతూ, “భారతదేశంలో, మధుమేహంతో నివసిస్తున్న చాలామంది గుండె సంబంధిత సమస్యల గురించి తెలియజేస్తున్నారు. ఈ సమస్యల పెరుగుదల యువతలో కూడా కనిపించడం కూడా చాలా ఆందోళనకరం. మధుమేహాన్ని సరిగ్గా నిర్వహించకపోతే అది అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్స్ వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాద కారకాల పెరుగుదలకు దారితీస్తుంది. గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నివారించడానికి ప్రజలు అదనపు జాగ్రత్తలు తీసుకోవడం, నివారణ చర్యలను అనుసరించడం చాలా ముఖ్యం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సీజీఎం వంటి పరికరాలతో గ్లూకోజ్ పర్యవేక్షణ వంటివి మనం పాటించగల కొన్ని చర్యలు’’ అని అన్నారు.
 
‘‘సమర్థవంతమైన మధుమేహ నిర్వహణ కోసం, గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా అవసరం" అని అబాట్‌ డయాబెటిస్ డివిజన్‌లోని మెడికల్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ కెన్నెత్ లీ అన్నారు. నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్(CGM) పరికరాల వంటి సాధనాలను ఉపయోగించి దీన్ని చేయవచ్చు. వీటిలో మీకు గ్లూకోజ్ స్థాయి అంతర్దృష్టులను అందించడానికి వేలు గుచ్చడం(ఫింగర్ ప్రిక్స్) అవసరం లేదు. ఇటువంటి పరికరాల్లో టైమ్ ఇన్ రేంజ్(TIR) వంటి ఉపయోగకరమైన కొలమానాలు ఉన్నాయి, ఇది ఒక రోజులో ఒకరి గ్లూకోజ్ స్థాయిలు నిర్దిష్ట పరిధిలో ఎంత సమయం ఉందో సూచిస్తుంది. ఆ పరిధిలో ఒక వ్యక్తి ఎక్కువ సమయం గడిపి నప్పుడు, వారికి హృదయ సంబంధ వ్యాధుల మార్కర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వాస్తవానికి, టీఐఆర్‌లో 10% పెరుగుదల ఒకరి కరోటిడ్ ధమనుల అసాధారణ మందం ప్రమాదాన్ని 6.4% తగ్గిస్తుంది. అందువల్ల, హృదయ సంబంధ వ్యాధులను దూరంగా ఉంచడానికి ఎక్కువ టీఐఆర్ సాధించడం చాలా ముఖ్యం’’ అని అన్నారు.
 
డయాబెటిస్ ఉన్నవారు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికి తీసుకోవలసిన 5 సులభమైన దశలు:
1. గుండెకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్‌లను నివారించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, సంతృప్త కొవ్వులు అనేవి సాధారణంగా వెన్న, రెడ్ మీట్, పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు వంటి ఆహారాలలో కనిపిస్తాయి. వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉపయోగించే పాక్షిక హైడ్రోజనేటెడ్ నూనెలలో తరచుగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఆకుకూరలు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో సమతుల్యం చేసుకోవడం గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడుతుందనేది పెద్ద రహస్యమేమీ కాదు. ఈ విధంగా మీరు తినే దానితో పాటు పోర్షన్ కంట్రోల్‌తో, మీరు మీ గ్లూకోజ్ స్థాయిలను బాగా స్థిరీకరించవచ్చు, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 
2. క్రమం తప్పకుండా వ్యాయామం: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, ఊబకాయం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వంటి అంశాలను వ్యాయామం ద్వారా పరిష్కరించడం మంచిది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల మీ మధుమేహాన్ని బాగా నిర్వహించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం, కూర్చునే సమయాన్ని తగ్గించుకోవాలని, ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు మితమైన-తీవ్రత కలిగిన శారీరక వ్యాయామం చేయాలని సిఫార్సు చేయబడింది, ఉదాహరణకు చురుకైన నడక లేదా సైక్లింగ్.
 
3. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి: సీజీఎం ద్వారా రియల్-టైమ్ ట్రాకింగ్ అనేది రక్తంలో ఏవైనా షుగర్ హెచ్చు తగ్గులుంటే వాటి గమనించడంలో మీకు సహాయపడుతుంది. రోజులో కనీసం 17 గంటలు సరైన గ్లూకోజ్ పరిధిలో(70–180 mg/dl) ఉండటానికి ప్రయత్నించడం ముఖ్యం. అదనంగా, CGM వంటి పరికరాలు మీ వైద్యుడు, సంరక్షకులతో కనెక్ట్ అవ్వడానికి మీకు సహాయపడే కనెక్ట్ చేయబడిన కేర్ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను కూడా అందిస్తాయి. ఇలా చేయడం ద్వారా, మీరు మీ మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
 
4. ధూమపానం, మద్యపానానికి నో చెప్పండి: ధూమపానం మీ రక్త నాళాల పొరను దెబ్బతీస్తుంది. మధుమేహం వల్ల కలుగుతుండే మీ ధమనుల సంకుచితాన్ని వేగవంతం చేస్తుంది. అంతేగాకుండా, మీరు ఆల్కహాల్ తీసుకోవడం కూడా తగ్గించాలి. ఎందుకంటే ఇది డయాబెటిస్ మందుల ప్రభావాన్ని దెబ్బ తీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది.
 
5. ఒత్తిడి నిర్వహణ: మీరు ఒత్తిడికి గురైనప్పుడు, మీ శరీరం మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది. కాలక్రమేణా ఇది మీ రక్తపోటును పెంచుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలను పెంచుతుంది. మీ ఒత్తిడిని తగ్గించడానికి, సంగీతం, యోగా లేదా డాన్స్, ప్రియమైనవారితో సమయం గడపడం వంటి సరదా కార్యకలాపాలలో పాల్గొన డానికి ప్రయత్నించండి.
 
ఆరోగ్యకరమైన గుండె కోసం మంచి జీవనశైలి ఎంపికలు చేసుకోవడం ముఖ్యం. మీ డయాబెటిస్ నిర్వహణను మెరుగుపరచడానికి, మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు తీసుకోవలసిన చర్యల గురించి మీ వైద్యుడిని సంప్రదించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Priest Break Dance : వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో పూజారులు బ్రేక్ డ్యాన్స్‌లు (video)

రాత్రికి రూ. 10 వేలు అంటే వెళ్లింది, తెల్లారాక డబ్బు ఇమ్మంటే గొంతు కోసాడు

ఎవర్నైనా వదిలేస్తా కానీ ఆ లంగా గాడిని వదలను: మద్యం మత్తులో వర్థమాన నటి చిందులు (Video)

Shivaratri: శివరాత్రికి ముస్తాబవుతున్న హైదరాబాద్ శివాలయాలు

భారతదేశపు మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం: ఢిల్లీ నుంచి జైపూర్‌కి 30 నిమిషాల్లో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళా సాధికారత నేపథ్యంలో మిమో చక్రవర్తి, సాషా చెత్రి సినిమా నేనెక్కడున్నా

గ్రామీణ నేపథ్యంలో యదార్థ సంఘటన ఆధారంగా ప్రేమకు జై

విరాజ్ రెడ్డి చీలం, గార్డ్ - రివెంజ్ ఫర్ లవ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్దం

తొలి చిత్రంతోనే టాలెంటెడ్ ప్రదర్శించిన హీరోయిన్ భైరవి

Malavika Mohanan: ప్రభాస్ స్వయంగా బిర్యానీ వడ్డించారు.. ఆయన సూపర్.. మాళవిక మోహనన్

తర్వాతి కథనం
Show comments