lemon ginger cinammon turmeric golden tea
కావలసిన పదార్థాలు
పసుపు పొడి - ఒక స్పూన్
తాజా అల్లం -ఒక స్పూన్
నల్ల మిరియాల పొడి - పావు స్పూన్
నిమ్మకాయ తరుగు - పావు కప్పు
దాల్చిన చెక్క పొడి - పావు స్పూన్
తయారీ విధానం:
ఒక బౌల్‌లో మూడు గ్లాసుల నీటిని మరిగించి అందులో దాల్చిన చెక్క పొడి, ఏలకులు, లవంగాలు రెండింటిని జోడించండి. ఆపై పసుపు, అల్లం, మిరియాలు, నిమ్మకాయ తరుగు కలపాలి. సిమ్‌లో మరిగించాలి. మూతపెట్టి 10-15 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని వడగట్టాలి.
సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కాసింత తేనె కలిపి తీసుకోవాలి. ఈ గోల్డెన్ టర్మరిక్ టీని తీసుకుంటే.. డయాబెటిస్ దూరం చేసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
మెటబాలిజం పనితీరును మెరుగు పరుస్తుంది. ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు రెండు కప్పుల మేర ఈ టీని తీసుకోవాలి. ఇలా మూడు వారాల పాటు తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. తద్వారా మధుమేహం దూరం అవుతుంది.