Webdunia - Bharat's app for daily news and videos

Install App

"గబ్బాలో బ్రేక్‌ఫాస్ట్ - లార్డ్స్‌లో లంచ్ - సెంచూరియన్‌లో డిన్నర్".. ఇదీ టీమిండియా కథ

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (10:22 IST)
భారత క్రికెట్ జట్టుకు ఉపఖండం ఆవల టెస్ట్ మ్యాచ్‌లలో గెలుపు అంటే ఓ కలగా, ఎండమావిగా ఉండేది. విదేశీ పిచ్‌లపై భారత క్రికెటర్లు పెద్దగా రాణించిన దాఖలు లేవు. వికెట్లు పడగొట్టలేకు, క్రీజ్‌లో నిలబడి పరుగులు చేయలేక ఆపసోహాలు పడేవారు. కానీ, ఇపుడు పరిస్థితి మారిపోయింది. పేసర్లకు స్వర్గధామంగా ఉండే పిచ్‌లపై భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. 
 
ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. విజయాలను తమ ఖాతాలో నమోదు చేసుకుంటున్నారు. 2020 సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని గబ్బా మైదానంలో మొదలైన భారత క్రికెట్ జట్టు టెస్ట్ విజయ పరంపర సౌతాఫ్రికాలోని సెంచూరియన్ పార్కులో పూర్తిచేశారు. 
 
ఈ యేడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప మలుపు. చాలా ప్రత్యేకమైనది కూడా. బ్యాట్స్‌మెన్లు రాణించినా, ముఖ్యంగా పేసర్లు అదిరే ప్రదర్శనతో గబ్బా, సెంచూరియన్‌లలో ఆతిథ్య ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల ఆధిపత్యానికి చెక్ పెట్టారు. ఈ రెండు స్టేడియాల్లోని పిచ్‌లో పేసర్లకు బాగా అనుకూలించే పిచ్‌లే. ఈ రెండు చోట్లా భారత్ విజయభేరీ మోగించింది. దీనికి కారణం భారత జట్టు పేస్ బౌలింగ్ బలపడటమే. 
 
గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకు 1988 నుంచి ఓటమి అనేది ఎరుగదు. భారత్ ఆడిన ఆరు టెస్టులు ఆడగా ఒక్క టెస్టులో కూడా నెగ్గింది లేదు. అలాంటి చోట ఈ యేడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా చివరిదైన నాలుగో టెస్ట్‌లో కంగారులను చిత్తుగా ఓడించారు. 
 
ఆ తర్వాత ఇంగ్లండ్ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా భారత్ 2-1 తేడాతో విజేయభేరీ మోగించింది. ఇపుడు సెంచూరియన్ పార్కులో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుపై ఆధిపత్యం చెలాయించి, 2021 సంవత్సరానికి ఘనంగా ముగించింది. ఈ మైదానంలో భారత్ విజయం అంత చిన్నదిగా పేర్కొనలేం. గతంలో ఇదే పిచ్‌పై భారత్ ఆడిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిపోయింది. 
 
కానీ, ఈ దఫా మాత్రం మొదటి రోజు నుంచే ఆధిపత్యం చెలాయిస్తూ టెస్ట్ మ్యాచ్‌లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా పేస్ బౌలర్లు ఆతిథ్య జట్టును శాసించారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 18 వికెట్లు నేలకూల్చి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే ఈ విజయాలపై మాజీలతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా "గబ్బాలో బ్రేక్‌ఫాస్ట్... లార్డ్స్‌లో లంచ్... సెంచూరియన్‌లో డిన్నర్" అంటూ కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. అలాగే, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రపంచంలోని ఏ మైదానంలో అయినా 20 వికెట్లు తీయగల అద్భుత బౌలింగ్ మన సొంతం. టీమిండియాకు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments