అనాథ యువతిపై వలంటీరు అత్యాచారం... గర్భందాల్చడంతో వెలుగులోకి..

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (17:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామవలంటీర్లు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే మహిళపై వారు ఈ తరహా అఘాయిత్యాలకు పూనుకుంటున్నారు. తాజగా తల్లిదండ్రులు లేని అనాథ యువతిపై ఒక వలంటీర్ అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఆ తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రెంటికోట గ్రామంలో ఓ దళిత యువతి తల్లిదండ్రులు కొన్నినెలల క్రితం చనిపోయారు. పైగా, ఆమెకు తోడబుట్టినవారు, బంధువులు కూడా లేరు. ఉన్నవారు కూడా దగ్గరకు చేరదీయలేదు. దీంతో ఆమె మందస మండలంలో యాచకవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రాత్రిపూట స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని వరండాల్లో పనుకునేది. 
 
ఈ క్రమంలో ఆ యువతిపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన వలంటీరు కణితి బాలకృష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భందాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే, వలంటీరును అరెస్టు చేయకుండా వైకాపా నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం