Webdunia - Bharat's app for daily news and videos

Install App

#FlashBack2020 : టాలీవుడ్‌పై కరోనా పంజా - ముచ్చటగా మూడే హిట్లు

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (16:01 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో కరోనా వైరస్ ప్రభావం అంతాఇంతాకాదు. ఇతర రంగాలకంటే.. చిత్రసీమపై కరోనా ప్రభావం అధికంగా ఉందని చెప్పొచ్చు. కరోనా కారణంగా సినిమా థియేటర్లలలో ఏకంగా తొమ్మిది నెలల పాటు బొమ్మపడలేదు. ఎక్కడి షూటింగులు అక్కడే ఆగిపోయాయి. ఈ కారణంగా లక్షలాది మంది సినీ కార్మికులు రోడ్డుపడ్డారు. ఆకలితో అలమటించారు. ఇలాంటి వారిని కొందరు బడా హీరోలు ఆదుకున్నారు. 
 
ఇపుడు కొన్ని ఆంక్షల నేపథ్యంలో అనుమతులు ఇచ్చినప్పటికీ ప్రేక్షకులు 50 శాతానికి మించరాదన్న షరతు విధించారు. అంతేకాకుండా, మార్చి నెల మూడో వారంలో లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు ఇప్పుడిపుడే ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. అయితే, అప్పులు తెచ్చి సినిమాలు ప్రారంభించిన నిర్మాతలు తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
 
నిజానికి తెలుగు చిత్రపరిశ్రమ ఇపుడు బాహుబలికి ముందు.. బాహుబలి తర్వాత అన్నట్టుగా మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇపుడు కొత్త పుంతలు తొక్కుతోంది. వైవిధ్య‌మైన క‌థ‌లు వస్తుండ‌టంతో ప్రేక్ష‌కులు మూవీలు చూసేందుకు తెగ ఆస‌క్తి చూపుతున్నారు. పైగా, తెలుగు చిత్రాలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాయి. 
 
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన "బాహుబ‌లి" వంటి చిత్రాలు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటేలా చేశాయి. ఈ చిత్రం తర్వాత అనేక తెలుగు మూవీలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతుండ‌గా, ఇవి కూడా తెలుగోడి స‌త్తా ఏంటో నిరూపించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి.
 
అయితే, కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్మేయక మునుపు ప్రతి యేడాది విడుదలయ్యే సినిమాల సంఖ్య వందల్లో ఉండేది. కానీ, కరోనా నామ సంవత్సరంగా గుర్తింపు పొందిన 2020లో మాత్రం కేవలం 49 చిత్రాలు మాత్రనే విడుదలయ్యాయి. ఇందులో సంక్రాంతికి వచ్చిన అల.. వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, భీష్మతో పాటు.. సంవత్సరాఖరులో వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలు మాత్రమే చెప్పుకోదగినవిగా ఉన్నాయి.
 
నిజానికి 2011లో 120 సినిమాలు థియేట‌ర్స్‌లోకి రాగా, 2012లో 127, 2013లో 178, 2014లో 194, 2015లో 172, 2016లో 181, 2017లో 177, 2018లో 171, 2019లో 193 సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి క‌నువిందు చేశాయి. కానీ, ఈ యేడాది కేవలం 49 మూవీలు మాత్రమే విడుదలయ్యాయి. వ‌చ్చే యేడాది క‌రోనా క‌రుణిస్తే థియేట‌ర్‌లో విడుద‌ల అయ్యే సినిమాల సంఖ్య 200 (స్ట్రైట్ తెలుగు సినిమాలు) చేర‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఏది ఏమైనా కరోనా నామ సంవత్సరం సినీ ఇండస్ట్రీకి ఓ పీడగా మిగిలిపోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆందోళనలో వున్నానంటున్న అల్లు అర్జున్

విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌ తో అనుష్క శెట్టి ఘాటి సిద్ధమవుతోంది

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments