Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్‌తో దిగాలు పడ్డ ఆక్వారంగం..

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (19:45 IST)
కరోనా వైరస్‌ ప్రభావంతో అన్ని రంగాలు మూలన పడుతున్నాయి. ఇక ఆక్వా రంగం అయితే కరోనా దెబ్బకు కుదేలు అవుతోంది. రొయ్యల ఉత్పత్తిలో ప్రస్తుతం దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది.  విశాఖ ఫిషింగ్ హార్బర్లో రొయ్యలు ఎగుమతికి జాతీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో మంచి పేరుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదొడుకుల కారణంగా ఆక్వా ఎగుమతి ఆర్డర్లు రద్దు అవుతున్నాయి. దీంతో సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు, ఇటు వ్యాపారులు, రైతులు అమ్మకాలు లేక నష్టాలు చవిచూస్తున్నారు.
 
ముఖ్యంగా రొయ్యల్లో మంచి ధర పలికే లోబ్ స్టార్ వంటివి హార్బర్‌కే పరిమితమవుతున్నాయి. దీంతో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడి రొయ్యల ధరలు 50 శాతం పడిపోయాయి. కరోనాకు ముందు టైగర్, లోబ్ స్టార్ వంటి రొయ్యలు కిలో రూ. 1200 వరకూ పలికేవి. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ప్రతిరోజూ వేలాది టన్నుల రొయ్యలు వివిధ రాష్ట్రాలకు... ముఖ్యంగా అసోం, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండేవి.
 
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాలు రొయ్యలను దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. విశాఖ హార్బర్ నుంచి చైనా, దక్షిణ కొరియా, జపాన్‌, దుబాయ్‌, ఖతార్‌, అమెరికా, యూరోపియన్‌ దేశాలకు కంటైనర్లలో ప్రాసెసింగ్‌ చేసిన రొయ్యలను ఎగుమతి చేసేవారు. జనవరిలో చైనాలో కరోనా విజృభించడంతో 30 శాతం ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయి. కోట్ల విలువైన ఉత్పత్తులు శీతలీకరణ గిడ్డంగుల్లో నిలిచిపోవడంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
 
భారీగా రొయ్యల పంట చేతికి వస్తుండటంతో కొనుగోలుదారులు ధర భారీగా తగ్గించారు. పోనీ మంచి రేటు వచ్చిన తరువాత అమ్ముదామంటే శీతల గిడ్డంగులు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఇలాగే కొనసాగితే అవి కుళ్లిపోయి మరింత నష్టం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆక్వా రంగంపై దృష్టి సారించి మమ్ములను ఆదుకోవాలని అంటున్నారు ఆక్వా రంగంపై ఆధారపడిన వర్గాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments