Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీకి ముందు - తర్వాత పన్ను రేట్లు ఎలా ఉంటాయంటే...

'ఒకే దేశం.. ఒకే పన్ను' విధానమంటూ స్వతంత్ర భారతావనిలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుంచి శ్రీకారం చుట్టనుంది. శుక్రవారం అర్థరాత్రి పార్లమెంట్‌ సెంట్రల్

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (12:42 IST)
'ఒకే దేశం.. ఒకే పన్ను' విధానమంటూ స్వతంత్ర భారతావనిలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుంచి శ్రీకారం చుట్టనుంది. శుక్రవారం అర్థరాత్రి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలు వేదికగా ఎంతో అట్టహాసంగా దీనికి అంకురార్పణ చేయబోతున్నారు. 
 
దేశమంతా ఒకే జీఎస్టీ ఉండటంతో రకరకాల పన్నుల నుంచి వినియోగదారులకు విముక్తి లభిస్తోంది. అంతేకాక కొన్ని వస్తువులపై పన్ను భారం కూడా వినియోగదారుడిపై పడనుంది. మరికొన్నింటి వస్తువులపై పన్నుభారం తగ్గనుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ రాకముందు వివిధ వస్తువుల పన్ను రేట్లు ఏ విధంగా ఉన్నాయి? వచ్చిన తర్వాత వాటిపై పన్ను భారం లేదా లాభం ఏ మేర ఉండబోతుందో ఓసారి పరిశీలిద్ధాం. 
 
చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు ,కేకులు పేస్టుల ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం వీటిపై 29 శాతం పన్నులు వసూలు చేస్తుండగా, జీఎస్టీ వచ్చాక 18 శాతం పన్నులు వసూలు చేస్తారు. వెన్న ధర తగ్గుతుంది. దీనిపై పన్ను 14.5 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది. చక్కెర, టీ, కాఫీ పొడి ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం వీటిపై 10 శాతం పన్ను వసూలు చేస్తుండగా ఇకపై ఐదు శాతమే వసూలు చేస్తారు. కాఫీ పొడి ధర అమాంతం తగ్గనుంది. దీనిపై ప్రస్తుతం 29 శాతం పన్ను వసూలు చేస్తుండగా, ఇకపై 5 శాతం మాత్రమే పన్ను వసూలు చేస్తారు. 
 
సిమెంట్ ధర స్వల్పంగా తగ్గుతుంది. వైద్య పరికరాల ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం 18 శాతం ఉండగా, జీఎస్టీ వచ్చిన తర్వాత 12 శాతం పన్ను వసూలు చేస్తారు. సబ్బులు, టూత్‌పేస్ట్‌, హెయిర్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతాయి. వీటిపై ప్రస్తుతం 29 శాతం పన్ను ఉండగా, జీఎస్టీ వచ్చిన తర్వాత 18 శాతం వసూలు చేస్తారు. బంగారం, ఫర్నీచర్‌ ధరలు తగ్గుతాయి. వీటిపై ప్రస్తుతం 29 శాతం పన్నులు వసూలు చేస్తుండగా, జీఎస్టీ వచ్చిన తర్వాత 12 శాతం వసూలు చేస్తారు. ద్విచక్రవాహనాల, చిన్నకార్ల, మీడియం కార్లు, పెద్ద కార్లు, ఎస్.యు.వి కార్లు, కమర్షియల్ వాహనాల ధరలు కొంతమేరకు తగ్గుతాయి. 
 
నెయ్యి ధర పెరుగుతుంది. నెయ్యిపై 5 శాతం పన్ను వసూలు చేస్తుండగా, జీఎస్టీ తర్వాత 12 శాతం వసూలు చేయనున్నారు. మొబైల్స్, టీవీల ధరలు పెరుగుతాయి. మొబైల్స్‌పై ప్రస్తుతం 6 శాతం పన్ను వసూలు చేస్తుండగా, జీఎస్టీ తర్వాత 12 శాతం, టీవీలపై ఇపుడు 26 శాతం వసూలు చేస్తుండగా, ఇకపై 28 శాతం పన్నును వసూలు చేస్తారు. వీటితో పాటు మైక్రోవేవ్‌ ఓవెన్‌ (26 నుంచి 28) ఫ్రిజ్ ( 26 నుంచి 28 శాతం), వాషింగ్ మెషిన్ (26 నుంచి 28 శాతం)ధరలు పెరుగుతాయి. ఆయుర్వేద మందుల (10 నుంచి 12 శాతం) ధరలు పెరుగుతాయి. కంప్యూటర్లు/ల్యాప్‌టాప్‌ల ధరలు పెరుగుతాయి. వీటిపై ప్రస్తుతం 6 శాతం పన్ను వసూలు చేస్తుండగా, జీఎస్టీ వచ్చిన తర్వాత 18 శాతం చొప్పున వసూలు చేస్తారు. 
 
టేబుల్‌వేర్ మెటల్స్ (11 నుంచి 12 శాతం), పెర్ఫ్యూమ్స్, కామస్మాటిక్స్ (17 నుంచి 28 శాతం), గ్లూకోమీటర్స్ (11 నుంచి 12శాతం), టేబుల్ వేర్ సెరామిక్స్, ఉడ్, ప్లాస్టిక్స్ (17.5 శాతం నుంచి 18 శాతం) ధరలు పెరుగుతాయి. కిచెన్‌వేర్ మెటల్స్ ధరలు తగ్గుతాయి. ఎక్స్‌రే (మెడికల్, డెంటల్, వెటిరినరీ) రేట్లు తగ్గుతాయి. రూ.500 లోపు చెప్పుల ధరలు (14.41 శాతం నుంచి 5 శాతం) తగ్గగా, రూ.500 పైబడిన చెప్పుల ధరలు (14.41 శాతం నుంచి 18 శాతం పన్ను) పెరుగుతాయి. రెడీమేడ్ గార్మెంట్స్ (5-6 శాతం నుంచి 5 శాతం)లో పెద్ద తేడా ఉండదు. చేతి గడియారాలు, జామ్, బేబీ ఫుడ్స్ ధరలు పెరగనుండగా, స్టేషనరీ  ధరలు కొంతమేరకు తగ్గనున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments