Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటిఎంలలో రూ.500 నోటుకు ఆశ పడ్డారా.. ఇక అంతే..!

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నుంచి ఏటిఎంలు సరిగా పనిచేయని పరిస్థితి. నవంబరు 8 నుంచి డిసెంబర్‌ 31వతేదీ వరకు ఎటిఎంలకున్న ఎనీ టైం మనీ కాస్త ఎనీ టైం మూతే అన్నట్లుగా మారిపోయాయి. దీంతో ప్రజలు పడిన ప్లాట

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (13:11 IST)
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నుంచి ఏటిఎంలు సరిగా పనిచేయని పరిస్థితి. నవంబరు 8 నుంచి డిసెంబర్‌ 31వతేదీ వరకు ఎటిఎంలకున్న ఎనీ టైం మనీ కాస్త ఎనీ టైం మూతే అన్నట్లుగా మారిపోయాయి. దీంతో ప్రజలు పడిన ప్లాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎటిఎంలలో నగదు పెట్టినట్లు ప్రకటనలు చేసినా వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం.. పది ఎటిఎంలలో రెండు మూడు ఎటిఎంలు మాత్రమ పనిచేశాయి. దీంతో పనిచేసే ఎటిఎంల వద్ద క్యూలైన్లు భారీగా ఉండేవి. జనవరి ఒకటి తర్వాత పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చిందనే చెప్పాలి. 
 
గతంలో మాదిరి చాంతాండంత పొడవున ఏటిఎంలలో క్యూలు లేకున్నా ఎంతో కొంత రద్దీ మాత్రం కనిపిస్తోంది. అయితే గతంలో మాదిరి కాకుండా రోజుకు 4,500వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించడం కొంతలో కొంత ఊరటగా చెప్పొచ్చు. అయితే ఎటిఎంలలో డబ్బులు తీసుకునేందుకు వెళుతున్న వారు 2 వేల నోటు రాకుండా ఉండేందుకు వీలుగా రూ.1500 మొత్తాన్ని నమోదు చేస్తున్నారు. అంటే ఒకరోజుకు తమకున్న రూ.4,500 లిమిట్‌ మొత్తాన్ని తీసుకునేందుకు రూ.1500 చొప్పున మూడుసార్లు ఎటిఎంల నుంచి డ్రా చేస్తున్నారు.
 
ఇలా చేయడం ద్వారా మొత్తం రూ.500 నోట్లను తీసుకుంటామన్న సంతోషంతో ఊరిగిపోతున్న వారికి ఛార్జీల మోత వాయించేస్తోంది. ఎందుకంటే మెట్రో నగరాల్లో, నగరాల్లో ఏటిఎం వాడకం మీద పరిమితులు ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఒకేసారి రూ.40 వేలు సైతం డ్రా చేసుకకునే అవకాశం ఉండేది. కొన్ని చోట్ల మాత్రం రూ.25 వేలు అంతకంటే తక్కువ మొత్తం వచ్చేది. దీతో నెలలో తమకు అవసరమైన మొత్తాన్ని పరిమితిలోపే వినియోగించుకునేవారు. ఒకట్రెండు సార్లు ఎక్కువగా వినియోగించినా పడే భారం కాస్త తక్కువగానే ఉండేది.
 
కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తంగా మారిపోయింది. రూ.2 వేల నోటు తీసుకుంటే దాన్ని మార్చుకోవడానికి కిందామీదా పడాల్సిరావడంతో వీలైనంతవరకూ ఎటిఎంల నుంచి రూ.500 నోట్ల కోసమే ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల కలుగుతున్న ఇబ్బంది ఏమిటంటే కోరుకున్నట్లుగా రూ.500 నోట్లు వస్తున్నా పలు దఫాలు ఏటిఎంలు వినయోగించుకోవడం కారణంగా అదనపు లావాదేవీల కోసం విధించే ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది ఎటిఎంలు వాడే వారికి భారంగా మారింది. చిల్లర నోట్లు కావాలంటే అందుకు ఎంతో కొంత భారానికి సిద్ధం కావాల్సిందేన్నట్లుగా పరిస్థితి మారిందని చెప్పక తప్పదు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments