Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీని చిరంజీవి టార్గెట్ చేశారు... ఎలా...?

మెగాస్టార్ చిరంజీవి. పదేళ్ళ పాటు రాజకీయాల్లో ఉండి చివరకు తాను కింగ్‌గా ఉన్న సినీపరిశ్రమలోకి వెళ్ళిపోయారు. అంటే రాజకీయాలకు సన్యాసం తీసుకున్నారని కాదు. ప్రస్తుత పరిస్థితులలో రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచ

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (13:04 IST)
మెగాస్టార్ చిరంజీవి. పదేళ్ళ పాటు రాజకీయాల్లో ఉండి చివరకు తాను కింగ్‌గా ఉన్న సినీపరిశ్రమలోకి వెళ్ళిపోయారు. అంటే రాజకీయాలకు సన్యాసం తీసుకున్నారని కాదు. ప్రస్తుత పరిస్థితులలో రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదన్నది ఆయన అభిప్రాయం. అందుకే చాలారోజులు కసరత్తు చేసి మరీ "ఖైదీ నెంబర్‌ 150"వ సినిమాను తీశారు. ఇదంతా బాగానే ఉన్నా సినిమాలో అధికార పార్టీ తెలుగుదేశంను చిరంజీవి టార్గెట్‌ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
 
రైతుల సమస్యలపై పోరాడే ఒక రియల్‌ హీరోగా 'చిరంజీవి ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో నటించారు. ఎక్కువగా సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో వైలెంట్‌ కూడా ఎక్కువే. ఎప్పుడంటే అప్పుడు ఫైట్లు.. మొత్తం మాస్‌ ప్రేక్షకులను బాగానే అలరించిందన్న టాక్‌ ఉంది కానీ చిరు డైలాగ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అదే రైతు రుణమాఫీ.
 
రైతుల భూములపై పోరాడే చిరంజీవి చివర్లో క్లైమాక్స్ వచ్చే సమయానికి మీడియాతో మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం ఆదుకుంటోందని జర్నలిస్టు ప్రశ్నిస్తే ఎక్కడ రుణమాఫీ అంటూ భారీ డైలాగ్‌ వదులుతారు. ఈ డైలాగ్‌ విన్న టిడిపి నాయకులందరికీ అరటిపండు వొలచి నోట్లు పెట్టినట్లుగా అంతా బాగానే అర్థమైపోయింది. సినిమాల్లో తెలుగుదేశం పార్టీని చిరు టార్గెట్‌ చేశారన్నది స్పష్టంగా తెలుస్తోంది. అసలు సినిమా ఘూటింగ్‌ సమయంలోనే తెలుగుదేశం పార్టీలో చిరంజీవి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు ఏకంగా నారాలోకేష్‌ రంగంలోకి దిగి చిరంజీవితో సంప్రదింపులు జరిపినట్లు వార్తలొచ్చాయి.
 
అయితే ఉన్నట్లుండి చిరంజీవి సైలెంట్‌ అయిపోవడం.. తాను తీసిన సినిమాలో చిరు డైలాగ్‌లు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటట్లుగా ఉండటం చూస్తుంటే అధికార పార్టీ నాయకులకు ఏమీ అర్థంకాని పరిస్థితిలా మారింది. చిరంజీవి డైలాగ్‌లో రైతు రుణమాఫీ ఎక్కడ అన్న విషయం స్పష్టంగా ఉండడంతో తెదేపా నేతలు దీనిపై రైతులకు ఏం చెప్పాలో తెలియక ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నారు. కారణం తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీని అమలు చేయకపోవడమే....!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

తర్వాతి కథనం
Show comments