Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిఫా వరల్డ్ కప్ 2018 : బెల్జియం ఇంటికి.. ఫైనల్స్‌కు ఫ్రాన్స్

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా మంగళవారం అర్థరాత్రి జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియం ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అదేసమయంలో ఫ్రాన్స్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది.

Webdunia
బుధవారం, 11 జులై 2018 (08:49 IST)
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా మంగళవారం అర్థరాత్రి జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియం ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అదేసమయంలో ఫ్రాన్స్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు 1-0 తేడాతో విజయం సాధించింది.
 
ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా, క్వార్టర్స్‌లో ఉరుగ్వేను మట్టికరిపించిన ఫ్రాన్స్‌.. సెమీస్‌లో అదే ఉత్సాహంతో బెల్జియంను ఓడించింది. దీంతో టైటిల్‌ను అందుకోవాలన్న బెల్జియం ఆశలు ఆవిరయ్యాయి. ఇరు జట్లు హోరా హోరీగా పోరాడటంతో తొలి అర్థభాగం వరకు ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. ప్రత్యర్థులిద్దరూ చక్కని డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు.
 
అయితే 51వ నిమిషంలో గ్రీజ్‌మన్‌ కొట్టిన కార్నర్‌ క్రాస్‌ షాట్‌ను శామ్యూల్‌ ఉమ్‌టిటి అద్భుతమైన హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఫ్రాన్స్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో బెల్జియం గోల్‌ కోసం విపరీతంగా ప్రయత్నించినా ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ లోరిస్‌ వారికి అడ్డుగోడలా నిలబడ్డాడు. ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 
 
1998 ప్రపంచకప్ సొంతం చేసుకున్న ఫ్రాన్స్… 2006లో రన్నరప్‌గా నిలిచింది. నేడు ఇంగ్లండ్‌, క్రొయేషియా తలపడే రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం మాస్కోలోని లుహినికి స్టేడియంలో ఫ్రాన్స్‌ ఫైనల్‌ ఆడనుంది. ఇక మూడో స్థానం కోసం ఓడిన జట్టుతో బెల్జియం తలపడనుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments