మహాలయ అమావాస్య.. బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు ఇస్తే..?

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (09:30 IST)
మహాలయ అమావాస్య రోజున ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణలు వదలడం, గతించిన పెద్దలను తలచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు నిండుతుంది. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు.
 
అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ పితృ దేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలని పురోహితులు చెబుతున్నారు.
 
ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృ దేవతలు ఏ తిథినాడు మృతి చెందారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఈ పదిహేను రోజులూ నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి. లేకుంటే మహాలయ అమావాస్య రోజున మాత్రం శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు.
 
ఉత్తరాయణం దేవతల కాలం గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలం గనుక అశుభమని పూర్వీకుల విశ్వాసం. అంతేకాక ఆషాఢంలో వచ్చే కర్కోటక సంక్రమణ నుంచే ప్రారంభమయ్యే దక్షిణాయనం వానలు, బురద, చిమ్మచీకటితో భయంకరమవుతుంది. అశుభమనిపిస్తే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.
 
అందులో భాద్రపద మాసమంతా జలమయంగా కనిపిస్తుంది. ఇదే ఒక మహా వినాశనం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు. కావున ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణములు చేయాలని శ్రాద్ధాలతో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించి ఉండవచ్చు. అంతేకాక ఆషాఢం రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు పితురులు చాలా కష్టపడుతుంటారు. కాబట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజూ శ్రాద్ధం జరపాలని ఆచారంగా పెట్టారు.
 
పితురులను తృప్తి పరచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గుస్తులైన మాతాపితురుల కోసం ప్రతీవారు ఈ పక్షాలలో పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు. భాద్రపద పూర్ణిమతో అరంభమైన పితృపక్షం, మహాలయ పక్షమం ఆ మాసపు అమావాస్యతో ముగుస్తుంది.
 
మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్నసంతర్పణ, పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు. ఇప్పటి వరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయంపాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతోకాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరతాయని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

18-01-2026 నుంచి 24-01-2026 వరకు వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments