Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహాలయ పితృ పక్షం ప్రారంభం.. ఈ 15 రోజులూ ఏం చేయాలంటే..?

Advertiesment
మహాలయ పితృ పక్షం ప్రారంభం.. ఈ 15 రోజులూ ఏం చేయాలంటే..?
, సోమవారం, 12 సెప్టెంబరు 2022 (23:10 IST)
మహాలయ పితృ పక్షం అనేది భాద్రపద మాసంలో శుక్ల పక్ష పూర్ణిమ తిథిలో ప్రారంభమయ్యే 15 రోజుల కాలం. ఇది కృష్ణ పక్షం అమావాస్య తిథితో ముగుస్తుంది. ఈ కాలంలో తమ పూర్వీకుల ఆత్మకు శ్రాద్ధం అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. పితృ పక్షం శ్రాద్ధం ద్వారా పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు.
 
ఈ ఏడాది పితృ పక్షం సెప్టెంబర్ 10, శనివారం ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్‌ 25వ తేదీతో ముగుస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 25న వచ్చే మహాలయ రోజున శ్రాద్ధ కాలం ముగుస్తుంది. పూర్వీకుల ఆత్మలు పితృలోకంలో నివసిస్తాయని.. పితృపక్షం సమయంలో వారు భూమిపైకి వస్తారని నమ్ముతారు. 
 
కాబట్టి, ప్రతి సంవత్సరం ఈ సమయంలో, పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
1. 1వ రోజు పూజ.. ధనాభివృద్ధినిస్తుంది. 
2. రెండవ రోజు - సత్సంతానం
3. మూడవ రోజు - తృతీయ అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
4. నాల్గవ రోజు - చతుర్థి శత్రువుల బారి నుంచి తప్పించుకునేలా చేస్తుంది. 
5. ఐదవ రోజు - పంచమి ఆస్తి చేరుతుంది. 
6. ఆరవ రోజు - షష్ఠి కీర్తిని పొందుతుంది.
7. ఏడవ రోజు - సప్తమి పదవులు లభిస్తాయి. 
8. ఎనిమిదవ రోజు - అష్టమి సమయోచిత బుద్ధినిస్తుంది
9. తొమ్మిదవ రోజు - నవమి.. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. ఆడశిశువుల జననం.
10. పదవ రోజు - దశమి చిరకాల కోరికలు నెరవేరుతాయి.
11. పదకొండవ రోజు - ఏకాదశి రోజున పూజ చదువు, క్రీడలు, కళా వికాసాన్నిస్తాయి. 
12. పన్నెండవ రోజు - ద్వాదశి రోజున పూజతో బంగారం, వస్త్రాలు చేకూరుతాయి. 
13. పదమూడవ రోజు - త్రయోదశి వ్యవసాయం వృద్ధి చెందుతుంది. గోవులు అభివృద్ధి చెందుతాయి, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. 

webdunia
14. పదునాలుగో రోజు - చతుర్దశి పాపాలు హరించుకుపోతాయి. భవిష్యత్తు తరాలకు మేలు.
15. పదిహేనవ రోజు - పూర్వీకులను పూజించడం వల్ల మన తరానికి కూడా మేలు జరుగుతుంది.
ఇవి... మహాలయ పితృపక్ష కాలంలో చేసే పూజ ద్వారా లభించే ఫలితాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-09-2022 సోమవారం దినఫలాలు - ఆదిత్య హృదయం పఠిస్తే..