''ఉండ్రాళ్ల తద్దె'' వ్రతం ఎలా చేయాలో తెలుసా..?

ఈ రోజున ఉండ్రాళ్ల తద్దె. ఉండ్రాళ్ల తద్దె అంటే వ్రతం. ఈ వ్రతాన్ని గురించి పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి వివరించారు. పరమేశ్వరుడు లోకానికి ఆదిదేవుడు. పార్వతీదేవి శివుని తన భర్తగా పొందాలని స్వామివారిక

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (11:30 IST)
ఈ రోజున ఉండ్రాళ్ల తద్దె. ఉండ్రాళ్ల తద్దె అంటే వ్రతం. ఈ వ్రతాన్ని గురించి పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి వివరించారు. పరమేశ్వరుడు లోకానికి ఆదిదేవుడు. పార్వతీదేవి శివుని తన భర్తగా పొందాలని స్వామివారికి తపస్సు చేస్తుంది. తపస్సు పూర్తయిన తరువాత భాద్రపద మాసం బహుళ తదియనాడు ఈశ్వరుడు పార్వతీదేవిని తన భార్యగా స్వీకరించాడు.
  
 
ఉండ్రాళ్ల తద్దె (సెప్టంబరు 27) వ్రతం మహిళలు ఆచరిస్తే సకల సౌభాగ్యాలు వర్ధిల్లుతాయని పార్వతీ వరమిచ్చారు. ఈ వ్రతాన్ని రెండురోజుల పాటు ఆచరించాల్సి ఉంటుంది. అంటే తదియ ముందు విదియ రోజున విఘ్నేశ్వరుని పూజించి కుడుములను స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. మెుదటి రోజు అంటే తదియ నాడు సాయం కాలం వేళలో మహిళ ముత్తయిదువులను ఈ వ్రతానికి ఆహ్వానించాలి. 
 
తదియ నాడు మధ్యాహ్నం వేళలో అమ్మవారిని పూజిస్తూ ఉత్తరేణి మెుక్కకు నమస్కరించాలి. దుర్గాదేవికి 16 ఉండ్రాళ్లను సమర్పించాలి. వ్రతానికి వచ్చిన ముత్తయుదువులకు చీర, ఉండ్రాళ్లు, తాంబులాను వాయినంగా ఇవ్వాలి. ఈ ఉండ్రాళ్ల తద్దె వ్రతాన్ని పదహారు కుడుముల నోము, షోడశోమావ్రతం అని కూడా పిలుస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

తర్వాతి కథనం
Show comments