కళ్యాణ సుందరీ వ్రతం ఎలా చేయాలి? ఫలితమేమిటి?
కళ్యాణ సుందరీ వ్రతం అన్ని శుభాలకు మూలమైంది. సూర్యుడు మీన లగ్నంలో ప్రవేశించినప్పుడు శుక్లపక్షం ఉత్తరా నక్షత్రం రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి. సూర్యోదయాన్నే లేచి మహాదేవుణ్ణి ధ్యానిస్తూ స్నానం చేసి నిత్యము చేసే కర్మానుష్టానాన్ని పూర్తిచేసుకుని శివార్చన చేయ
కళ్యాణ సుందరీ వ్రతం అన్ని శుభాలకు మూలమైంది. సూర్యుడు మీన లగ్నంలో ప్రవేశించినప్పుడు శుక్లపక్షం ఉత్తరా నక్షత్రం రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి. సూర్యోదయాన్నే లేచి మహాదేవుణ్ణి ధ్యానిస్తూ స్నానం చేసి నిత్యము చేసే కర్మానుష్టానాన్ని పూర్తిచేసుకుని శివార్చన చేయాలి. బంగారంతో శివుడి ప్రతిమను చేయించి పూర్ణ కలశంతో ఉంచి గౌరీదేవిని సంకల్పం చేసుకుని పిండి వంటలతో మహా నైవేద్యం పెట్టాలి. పండితులు శివ భక్తులు అయిన బ్రాహ్మణులకు రుచికరమైన భోజనం పెట్టి శక్తి వంచన లేకుండా దక్షిణ ఇచ్చి సత్కరించాలి.
తరువాత శివాలయానికి వెళ్లి శివుణ్ణి అర్చించి మూడు ప్రదక్షిణలు చేసి మహాదేవుణ్ణి స్తుతించి బ్రాహ్మణులకి దక్షణలిచ్చి ఇంటికి రావాలి. తరువాత బ్రాహ్మణులకి పండ్లు, చెరుకురసం ఇచ్చి వాళ్లని తృప్తి పరచాలి. వ్రతం ఆచరించేవారు పాయసాన్నం మాత్రమే తిని ఒక దర్భాసనం మీద కూర్చుని పరమేశ్వర ధ్యానం చేస్తూ రాత్రంత ధ్యానం చేయాలి.
మరునాడు ఉదయాన్నే స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని బంగారు శివుడి ప్రతిమను దక్షిణ తాంబూలలతో సహా బ్రాహ్మణుడి దానం ఇవ్వాలి. ఆ తరువాత శివ భక్తులతో కలిసి ఒకే పంక్తిలో కూర్చుని భోజనం చేయాలి. పూర్వం ఈ వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని, బ్రహ్మ సరస్వతిని, ఇంద్రుడు శచీదేవిని, అగస్త్యుడు లోపాముద్రని భార్యలుగానూ పొందారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరిస్తే భోగభాగ్యాలు పొందడమే కాకుండా కైవల్యాన్ని కూడా పొందుతారు.