ఆ గుడిలో పరమేశ్వరుడికి చేపల కూర నైవేద్యం

సాధారణంగా ఏ గుడిలోనైనా దేవుడికి పండ్లు, స్వీట్లు, పాయసం లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయాన్ని బట్టి కొన్నిచోట్ల పరమాన్నం, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటివి నైవేద్యంగా పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయా ప్రాంతాల్లోని ఆచారాలు, సంప్

గురువారం, 9 ఆగస్టు 2018 (22:53 IST)
సాధారణంగా ఏ గుడిలోనైనా దేవుడికి పండ్లు, స్వీట్లు, పాయసం లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయాన్ని బట్టి కొన్నిచోట్ల పరమాన్నం, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటివి నైవేద్యంగా పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయా ప్రాంతాల్లోని ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగానే అక్కడి దేవుడికి నైవేద్యాలను నివేదిస్తారు. కొన్ని ఆలయాల బయట జంతుబలి జరుగుతుండటం అందరికి తెలుసు. కొన్నిచోట్ల  దేవుళ్లకి మాంసాహారం కూడా నైవేద్యంగా సమర్పిస్తారట. 
 
అలాంటి దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కొమరాడలోని గుంప సోమేశ్వర ఆలయంలోని పరమశివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు. శివుడికి చేపలేంటి.. ఇలాంటి వింత ఆచారాలేంటి అనుకుంటున్నారా... భక్త కన్నప్ప శివుడికి అడవిలో దొరికిన జంతు మాంసాన్ని పెట్టినట్లు పురాణాల్లో ఉంది. అలాగే ఇక్కడ ఇదో ప్రత్యేకమైన ఆచారం.
 
ఈ ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో శివుడికి చేపలకూరనే నైవేద్యంగా సమర్పిస్తారు. రుచిగా వండిన చేపలకూర శివుడికి నైవేద్యంగా మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని తద్వారా బోళాశంకరుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్నామని భక్తులు పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శుభప్రదమైన మాసం.. నోములు, వత్రాలతో సందడే సందడి..