బతుకమ్మ జాతర.. తొమ్మిది రోజులు.. తొమ్మిది నైవేద్యాలు

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (16:17 IST)
బతుకమ్మ జాతర వచ్చేస్తోంది. తొమ్మిది రోజులపాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శెనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. 
 
మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. కానీ చివరి రోజు అయినా సద్దుల బతుకమ్మ నాడు మాత్రం నైవేద్యాన్ని మహిళలే తయారుచేస్తారు.
 
1. ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమావాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించాలి. 
 
2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి. 
 
3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి. 
4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి. 
5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పించాలి. 
6. అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. ఈనాడు  నైవేద్యమేమి సమర్పించరు. 
7.  వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలి. 
8.  వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. 
9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి. 
 
తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. గానాబజానాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. పూలతో తయారు చేసిన బతుకమ్మ శిరస్సుపై కొలువుంచిన పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ మాంగళ్యానికి అంటే పుస్తెకు పూసుకుంటారు. 
 
దీనివల్ల తమ మాంగళ్యం అంటే తమ భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తుందని విశ్వాసం. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి తయారు మాలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాపై జరుగుతున్న విషప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్, తక్షణమే ఆ కంటెంట్ తొలగించాలి: బీఆర్ నాయుడు

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

అన్నీ చూడండి

లేటెస్ట్

అత్యాధునిక టెక్నాలజీతో అన్నప్రసాద సముదాయం, ఆధునిక వంటగది

01-03-2026 నుంచి 07-03-2026 వరకు వార రాశిఫలాలు - మేష రాశివారిదే పైచేయి...

01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ

28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం

తర్వాతి కథనం
Show comments