Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌ఫాస్ట్‌గా ఎప్పుడూ అట్టూ, ఇడ్లీయేనా...? కల్లప్పం కాస్త టేస్ట్ చేసి చూడండి...

ఇంట్లో సాధారణంగా దోసె, ఇడ్లీ అంతగా కాదంటే ఉప్మా ఇవే చేస్తుంటారు. వీటిని పిల్లలు తినీతినీ విసిగిపోయి తమకు వేరే కొత్త వంటకం కావాలని మారం చేస్తుంటారు. వాళ్లు మారాం చేసేదాకా ఎందుకు...? కొత్త వంటకాలను వారికి రుచి చూపిస్తే పోతుంది కదా. కేరళలో టేస్టీగా చేసు

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (12:42 IST)
ఇంట్లో సాధారణంగా దోసె, ఇడ్లీ అంతగా కాదంటే ఉప్మా ఇవే చేస్తుంటారు. వీటిని పిల్లలు తినీతినీ విసిగిపోయి తమకు వేరే కొత్త వంటకం కావాలని మారం చేస్తుంటారు. వాళ్లు మారాం చేసేదాకా ఎందుకు...? కొత్త వంటకాలను వారికి రుచి చూపిస్తే పోతుంది కదా. కేరళలో టేస్టీగా చేసుకుని కల్లప్పం తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు
బియ్యం - 200 గ్రాములు, డ్రై ఈస్ట్- అర టీస్పూను, ఉప్పు - 5 గ్రాములు, కొబ్బరి తురుము - అరకప్పు, మెంతులు - అర టీస్పూను, వెల్లుల్లి - 5 గ్రాములు, ఉల్లిపాయలు - 10 గ్రాములు, పంచదార -20 గ్రాములు, కొబ్బరి పాలు - 100 మి.లీ
 
తయారీవిధానం... 
బియ్యం రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. ఈ బియ్యం ముద్దలో 50 గ్రాములు తీసుకుని కొద్దిగా నీరు చేర్చి జారుడుగా తయారుచేసుకోవాలి. దీన్ని పొయ్యిమీద పోసి ఉండకట్టకుండా వుడికించుకోవాలి. 
 
వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొబ్బరి, మెంతులు కొద్దిగా దంచుకోవాలి. మిగిలిన ముద్దలో వీటిని వేసి ఉప్పు, పంచదార, ఈస్ట్, కొబ్బరిపాలు, ఉడికించిన బియ్యం వేసి కలపాలి. దీన్ని నాలుగైదు గంటలపాటు పక్కనుంచాలి. తర్వాత ఈ పిండితో దోశలు పోసి చికెన్ లేదా ఎగ్ రోస్టుతో తింటే భలే రుచిగా వుంటుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments