Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్సియెస్ట్ బెల్లీ కోసం అమ్మాయిలు పాట్లు... అలాక్కావాలంటే...?

సెక్సియెస్ట్ బెల్లీ... అంటే అత్యంత ఆకర్షణీయంగా నడుము, ఉదర భాగాలను ఉంచుకునేందుకు అమ్మాయిలు తెగ యత్నిస్తుంటారు. నడుము, ఉదర భాగాలు సెక్సీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కనీసం వారంలో మూడుసార్లయినా సుమారు అరగంటపాటు నడకను గానీ, వ్యాయామంకానీ చేయాలి.

Webdunia
గురువారం, 4 మే 2017 (22:27 IST)
సెక్సియెస్ట్ బెల్లీ... అంటే అత్యంత ఆకర్షణీయంగా నడుము, ఉదర భాగాలను ఉంచుకునేందుకు అమ్మాయిలు తెగ యత్నిస్తుంటారు. నడుము, ఉదర భాగాలు సెక్సీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కనీసం వారంలో మూడుసార్లయినా సుమారు అరగంటపాటు నడకను గానీ, వ్యాయామంకానీ చేయాలి. ఇలా చేయడం ద్వారా పొట్టవద్ద చేరిన కొవ్వు కరిగి స్లిమ్‌గా మారుతుంది. 
 
ఫైబర్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వైట్ బ్రెడ్, బంగాళాదుంపలు, అన్నం తగినంత తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే గోధుమ రొట్టెలకంటే ముడిబియ్యాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనివ్వండి. ఇవి పొట్టలో కొవ్వు చేరకుండా చూడటంలో సహాయపడతాయి.
 
పాలు తాగే అలవాటున్నవారు కొవ్వులేని పాలును తీసుకోవడం మంచిది. శరీరంలోని అవయవాలన్నిటికీ పని కల్పించే విధంగా ఓ పది లేదా పదిహేను నిమిషాలు వ్యాయామం చేయాలి. కూర్చుని పనిచేసే ఉద్యోగం చేసేవారైతే కనీసం గంటకోసారి కుర్చీలోంచి లేచి ఓ ఐదు నిమిషాలు అటుఇటు తిరిగి రావడం మంచిది. లేదంటే బానపొట్ట పెరగడం ఖాయం. 
 
ప్రతిరోజూ ఉదయం పూట ఓ 6 బాదం పప్పులను నమలండి. ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీటిని తాగండి. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. ఒకేసారి భారీగా భోజనాన్ని లాగించేయకుండా రెండు మూడుసార్లు కొద్దికొద్దిగా తినండి. ఫలితంగా పొట్ట ముందుకు పొడుచుకు వచ్చినట్లు కనిపించకుండా స్లిమ్‌గా ఉండవచ్చు. అంతేకాదు పడక గదికి వెళ్లే ముందు కనీసం మూడుగంటల ముందే భోజనాన్ని ముగించండి. ఇవన్నీ పాటించండి సెక్సియెస్ట్ బెల్లీ సొంతమవుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments