Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బ... ఆలూ టిక్కీ ఎంతో రుచి... టేస్టీగా ఎలా చేయాలంటే?

బంగాళదుంపలో విటమిన్-సి, విటమిన్- బి6, పొటాషియం పుష్కలంగా ఉండమే కాదు, కొద్ది మెత్తంలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ లాంటి మూలకాలు లభిస్తాయి. బంగాళదుంప తొక్కలో ఉన్న ప

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (12:48 IST)
బంగాళదుంపలో విటమిన్-సి, విటమిన్- బి6, పొటాషియం పుష్కలంగా ఉండమే కాదు, కొద్ది మొత్తంలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ లాంటి మూలకాలు వుంటాయి. బంగాళదుంప తొక్కలో ఉన్న పీచు పదార్ధం కూడా చాలా ఉపయోగకరం. ఓ మాదిరి దుంప పొట్టు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. అంతేకాదు ఇందులో కార్టినాయిడ్స్, పాలీఫినాల్స్ లాంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి.

తెలుగు వంటకాలలో రుచికరమైన వంటకం ఆలూ టిక్కి. దీనిని ఎలా తయారుచేసుకోవాలో తెలుకోవాలని ఉందా... అయితే క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే ఆలూ టిక్కి రెడీ అవుతుంది. 

 
ఆలూ టిక్కికి కావలసిన పదార్ధాలు:
బంగాళ దుంపలు - 1/2 కేజీ
కాలిఫ్లవర్- 1 కప్పు
ఉల్లిపాయలు -2
పుదీన, కొత్తిమీర - 1 కప్పు
నూనె- సరిపడ
పచ్చిబఠాణీ - 1 కప్పు
పచ్చిమిర్చి- 2 
టమోట -1 
పోపు గింజలు - 1 స్పూన్  
గరం మసాల - 1/2 స్పూన్
బ్రెడ్ - 1 ప్యాకెట్ 
ఉప్పు -సరిపడ 
 
ఆలూ టిక్కి తయారుచేసే విధానం:
ముందుగా బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి మెత్తగా చేసుకోవాలి. తరువాత అందులో పుదీన, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, గరం మసాల, వేసి ముద్దగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బటాణీలను కూడా ఉడికించిన తరువాత టమోటాలను వేటి నీటిలో ఉడికించి తోలు తీసి మెత్తగా ముద్ద చేసి ఉంచుకోవాలి. 
ఇప్పుడు స్టవ్ మీదు బాండీని పెట్టి కొద్దిగా నూనె పోసి కాగాక పోపుగింజలు వేయాలి అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు, టమాటా, ముద్ద, ఉడికించిన బటాణీల ముద్ద వేసి పొడిగా అయ్యేదాగా వేపి దించాలి.

ఆ తరువాత ఇంతకుముందు తయారుచేసుకున్న బంగాళాదుంప ముద్దలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కను నీటిలో ముంచి రెండు అరచేతులతో గట్టిగా వత్తి అందులో బంగాళాదుంప మిశ్రమాన్ని కొద్దిగా తీసుకోని బ్రెడ్ లోపల పెట్టి చుట్టూ మూసివేయాలి. ఇలా అన్ని తయారుచేసుకుని నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే రుచికరమైన ఆలూ టిక్కి రెడి. దీనిని టమాటా సాస్‌తో వేడిగా సర్వ్ చేసుకుంటే రుచిగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

తర్వాతి కథనం
Show comments