Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేపాకు ముద్దలో కర్పూరాన్ని కలిపి శిరోజాలకు పట్టిస్తే?

దేవుడికి హారతి ఇవ్వడం ద్వారా కర్పూరం నుంచి వెలువడే పొగ, వాసన మానసిక అలజడులను, ఆందోళనల్ని తగ్గిస్తుంది. అందుకే దేవుడికి కర్పూరంతో హారతి ఇస్తారు. ఎందుకంటే దేవుడిని ధ్యానించేటప్పుడు ఇతర ఆలోచనలు లేకుండా ప

వేపాకు ముద్దలో కర్పూరాన్ని కలిపి శిరోజాలకు పట్టిస్తే?
, బుధవారం, 9 మే 2018 (15:55 IST)
దేవుడికి హారతి ఇవ్వడం ద్వారా కర్పూరం నుంచి వెలువడే పొగ, వాసన మానసిక అలజడులను, ఆందోళనల్ని తగ్గిస్తుంది. అందుకే దేవుడికి కర్పూరంతో హారతి ఇస్తారు. ఎందుకంటే దేవుడిని ధ్యానించేటప్పుడు ఇతర ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా, పవిత్రంగా వుండాలనే. కర్పూరంలోని ఔషధ గుణాలు జలుబును తగ్గిస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. 
 
అంటువ్యాధులను ప్రబలకుండా చేస్తుంది. కాంఫర్‌ లారెల్‌ అనే చెట్టు ఆకులు, కొమ్మలనుండి కర్పూరాన్ని తయారు చేస్తారు. కర్పూరం వాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్వల్ప గుండె సమస్యలు, అలసట వంటి వాటికి కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది. అన్ని రకాల ఆర్థరైటిస్‌లను నివారిస్తుంది. నరాల సమస్యలు, వీపునొప్పికి  బాగా పనిచేస్తుంది. అలెర్జీలను దూరం చేస్తుంది. 
 
కొబ్బరినూనెలో కర్పూరాన్ని రంగరించి కురుపులపై రాస్తే అవి తగ్గిపోతాయి. ఎలర్జీల వల్ల కలిగే దురద, దద్దుర్లమీద కర్పూరాన్ని రాస్తే నివారణ కలుగుతుంది. కఫాన్ని కరిగించే గుణం కర్పూరంలో వుంది. చర్మంమీద వచ్చే వాపును పోగొడుతుంది. 
 
తలనొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. బ్రాంకైటిస్ వ్యాధితో బాధపడేవారు మరుగుతున్న నీటిలో కర్పూరాన్ని వేసి ఆవిరి పడితే ఉపశమనం కలుగుతుంది. ఇంగువలో కర్పూరాన్ని కలిపి తీసుకుంటే ఉబ్బసంలో ఏర్పడే ఆయాసాన్ని తగ్గిస్తుంది. కర్పూరంలో యాంటీ సెప్టిక్ గుణాలు అధికం. కర్పూరం పొడిని మోచేతుల మీద రుద్దితే నలుపుదనం పోయి చర్మం కాంతులీనుతుంది.
 
కర్పూరం వాసన చూస్తుంటే ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది. వేసవిలో స్నానం చేసే నీటిలో కర్పూరాన్ని కలపటం లేదా కూలర్‌లో కర్పూరాన్ని వేసి ఉపయోగిస్తే గది మొత్తం పరిమళభరితంగా ఉంటుంది. వేపాకు ముద్దలో కర్పూరాన్ని కలిపి శిరోజాలకు పట్టించి, తడి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే పేలు, చుండ్రు సమస్యకు నివారణ కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌందర్య చిట్కాలు.. ఉప్పు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే?