Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సూప్ తాగితే కొలెస్ట్రాల్ కటాఫ్... ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (18:46 IST)
యాంటీఆక్సిడెంట్‌లు సమృద్ధిగా కలిగిన టొమాటో, రక్తాన్ని శుద్ధి చేయటమే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, విటమిన్‌ సి, విటమిన్‌ కె, కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌, టొమాటోలో సమృద్ధిగా వున్నాయి. అలాంటి టొమాటోలతో సూప్ తయారు చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలా చేయాలో చూద్దాం. 
 
కావలసిన పదార్థాలు :
‌టొమాటోలు - ఆరు
కొత్తిమీర తరుగు- అరకప్పు
‌నీళ్ళు - ఆరు కప్పులు 
ఉల్లిగడ్డ- 1
‌వెల్లుల్లి- 2 రేకులు
‌బిర్యానీ ఆకులు- 2
‌మిరియాలు- 3
‌వెన్న లేదా నెయ్యి - టీ స్పూను
ఉప్పు- తగినంత
క్యారెట్‌- 1
పంచదార- అర టీ స్పూను
 
తయారీ విధానం:
 
ముందుగా టొమాటో, క్యారెట్‌, నీళ్ళు, మిరియాలు, బిర్యాని ఆకులు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పంచదార, పప్పులను కుక్కర్‌లో ఉడికించాలి. కుక్కర్‌ మూడు విజిల్స్‌ వస్తే సరిపోతుంది. మెత్తగా అయిన టొమాటో మిశ్రమాన్ని ఫిల్టర్‌ చేసి మెత్తగా చేత్తో మెదిపి ఆ గుజ్జును కూడా ఫిల్టర్‌ చేసుకోవచ్చు. లేదా మిశ్రమాన్ని గ్రైండ్‌ చేసి గుజ్జును వడకట్టి తీసుకోవచ్చు. మరో పాన్‌లో వెన్న లేదా నెయ్యివేసి బ్రెడ్‌ ముక్కలను వేయించాలి. సూప్‌ తాగేముందు వేయించిన బ్రెడ్‌ ముక్కలను వేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments