Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకట్టుకునే కాళ్ళ పట్టీల కోసం ఏం చేయాలి? ఏ సమయంలో వాడాలి?

Webdunia
గురువారం, 14 మే 2020 (20:46 IST)
కాళ్ళ పట్టీలు నడుస్తున్నప్పుడు చేసే ధ్వని ఇంట్లో ప్రత్యేక అందాన్నిస్తుంది. ఆనందాన్నిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల ఆటలప్పుడు కాళ్ళకున్న మువ్వల పట్టీలు చక్కని శబ్ధాన్నిస్తూ ఇంటికి ఓ అలంకారాన్ని మైమరపిస్తాయి. అయితే కాళ్ళ పట్టీలు ఎన్నో అలంకారాలతో అలరారుతూ మనల్ని ఆకట్టుకుంటుంటాయి.
 
గిల్ట్ పట్టీలు వెండి పట్టీల్లా భ్రమింపజేసే వైట్ మెటల్ రకాలు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చాయి. నమ్మకమున్న షాపుల్లోనే పట్టీలు కొనడం మంచిది. రోజూ తియ్యకుండా ధరించే పట్టీలు సన్నని డిజైన్‌తో వెండితో చేసినవి, మరీ బరువైనవి కాకుండా తేలికపాటివి తీసుకోవాలి. 
 
పట్టీలను చింతపండుతో తోమితే మళ్ళీ మెరుగు వస్తుంది. నలుపురంగు పోతుంది. బంగారు పూత పట్టీలు ప్రత్యేక సందర్భాల్లో ధరిస్తే బాగుంటుంది. కొంత వయస్సు దాటాక అంటే పాతికేళ్ళు దాటిన తరువాత గజ్జెల పట్టీలు ధరించడం బాగుండదు.
 
పెళ్ళిళ్ళప్పుడు, పేరంటాళ్లప్పుడు, పెద్ద డిజైన్ పట్టీలు పెడితే బాగుంటుంది. ఆఫీసుకి వెళ్ళేటప్పుడు మీటింగ్ ఉన్నప్పుడు శబ్థం చేయని కాళ్ళపట్టీలు ధరించాలి. రాత్రి, ప్రయాణాలప్పుడు పట్టీలు వాడకపోతేనే మంచిది.
 
రెండుకాళ్ళ పట్టీలను వేర్వేరుగా పొట్లాలుగా కట్టి ఉంచితే ఇరుక్కుకుండా ఉంటాయి. సులభంగా తీసుకుని ధరించవచ్చు. రంగు కాగితంలో దాస్తే మరీ మంచిదట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

తర్వాతి కథనం
Show comments