Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో మాయిశ్చరైజర్స్‌ వాడండి..

పొడిచర్మం కలిగివున్నవారు చలికాలంలో మాయిశ్చరైజర్ వాడాలని బ్యూటీషియన్లు అంటున్నారు. చర్మం పగలకుండా వుండాలంటే మాయిశ్చరైజర్లు వాడాలి. సన్‌స్క్రీన్ క్రీమ్‌లు వాడాలి. స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అ

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (16:12 IST)
పొడిచర్మం కలిగివున్నవారు చలికాలంలో మాయిశ్చరైజర్ వాడాలని బ్యూటీషియన్లు అంటున్నారు. చర్మం పగలకుండా వుండాలంటే మాయిశ్చరైజర్లు వాడాలి. సన్‌స్క్రీన్ క్రీమ్‌లు వాడాలి. స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చలికాలంలో పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది. ఆలివ్ ఆయిల్, అలోవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.
 
సున్నిత చర్మం కలిగిన వారు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రసాయనాలు వున్న సన్‌స్క్రీన్లను వాడాలి. పెర్ఫ్యూమ్‌ క్రీములకు దూరంగా వుండాలి. సెన్సిటివ్ స్కిన్ కోసం డిజైన్ చేసిన ఉత్పత్తులను వాడటం మంచిది.
 
శీతాకాలంలో ఆయిలీ స్కిన్ వారికి పెద్ద సమస్యలేమీ ఉండవు. వీళ్ల చర్మం చలికాలంలో కూడా సాధారణంగా వుంటుంది. వీరు సూర్యరశ్మి నుంచి స్కిన్ రక్షణకుగాను వాటర్‌ బేస్డ్‌ సనస్ర్కీన్‌ లోషన్స్ వాడితే మంచిది. ఆయిల్ స్కిన్ కలిగివున్న వారు అలోవేరా క్రీములను వాడటం మంచి ఫలితాలనిస్తుంది.
 
చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం..కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దనా చేయాలి. తద్వారా మృతకణాలు తొలగిపోయి.. చర్మం మృదువుగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Attack on Chilkur Priest: తెలంగాణ సర్కారు వారిని కఠినంగా శిక్షించాలి.. పవన్ కల్యాణ్ (video)

కిరణ్ రాయల్ కేసులో ట్విస్ట్... మహిళను అరెస్టు చేసిన జైపూర్ పోలీసులు.. ఎలా? (Video)

రోడ్డు ప్రమాదం.. హోంమంత్రి అనిత కారును ఆపి ఏం చేశారంటే? (video)

ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకు.. పిడిగుద్దులు కురిపించిన తండ్రి.. అనంతలోకాలకు...

విషయం చెప్పండి .. ఓవర్ యాక్షన్ చెయొద్దు : హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

Ritu Varma: మజాకా లో రోమాన్స్ పెంచిన సందీప్ కిషన్, రీతు వర్మ

ఆస్ట్రేలియాలో చిత్రీకరించిన హరర్, థ్రిలర్, లవ్ సినిమా గార్డ్

Dhanush: ప్రేమ, బ్రేకప్ నేపథ్యంలో ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంతా కోపమా

తర్వాతి కథనం
Show comments