Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైహీల్స్ వాడుతున్నారా..?

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (12:30 IST)
కొందరికి హైహీల్స్ అంటే పిచ్చి.. ఎక్కడికి వెళ్లినా వాటినే వాడుతుంటారు. వారు నడవలేకపోయినా సరే ఆ హీల్స్‌నే వేసుకుంటారు. ఈ హైహీల్స్‌లో ఏముకుంటుందో కానీ,  హైహీల్స్ వేసుకుంటే చూడడానికి బాగుంటుందేమోగానీ.. వాటి హీల్ పరిమితికి మించి ఉండడం వలన చాలా నష్టాలు ఉన్నాయి. కనుక హైహీల్స్ వేసుకున్నప్పుడు ఈ పద్ధతులు పాటిస్తే.. తప్పక ఫలితం ఉంటుంది. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం..
 
1. ఎముక బాల్ మీద అదనపు ఒత్తిడి కలిగి, మడమలో తీవ్రమైన నొప్పి వస్తుంది. దాంతో తుంటి భాగంలో ఉండే హిప్ ఫ్లెక్సార్ కండరాలు అవసరమైనదానికంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఈ చెప్పులు మోకాల్లో లోపలివైపున ఒత్తిడిని కలిగించి, ఆస్టియో ఆర్థరైటిస్‌కు దారితీస్తాయి. 
 
2. రోజంతా హైహీల్స్ వేసుకోకుండా.. మీకు మరీ ముఖ్యమైనవి అనిపించిన కొన్ని సందర్భాల్లోనే వాటిని ధరించాలి. లేదంటే.. పిక్క కండరాలు పొట్టిగా మారి, బలం కోల్పోతాయి.
 
3. మీరు నిర్దేశించుకున్న సమయం కంటే ఎక్కువ సేప్ హైహీల్స్ వేసుకుంటే.. అవి విడిచాక కాసేపు రెండు కాళ్లూ కాస్తంత దూరంగా పెట్టి పాదాలు నేలకు ఆనేట్లుగా ఉంచి కాసేపు అలానే నిలబడాలి. ఈ సమయంలో ముందుకు వంగి మోకాళ్లు ఒంగకుండా చేతి వేళ్లతో కాలివేళ్లను ముట్టుకునే ఎక్సర్‌సైజ్ చేయాలి. 
 
4. పాయింటెడ్ హైహీల్స్ లేదా మరీ బిగుతుగా ఉండే షూస్ వేసుకోవద్దు. హైహీల్స్ వేసుకునే ముందుగా మీ మోకాలి కింద వెనుక భాగంలో ఉండే కాఫ్ మజిల్స్‌ను కాసేపు రుద్దుకుంటూ మర్దన చేయాలి. ఇలా చేస్తే పాదాలు నొప్పిగా ఉండవు. 
 
5. హైహీల్స్ చెప్పుల కోసం మధ్యాహ్నం లేదా సాయంత్రాలలోనే షాపింగ్ చేయాలి. ఆ సమయంలో మీ పాదాలకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మిగిలిన సమయాల్లో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. 
 
6. మీ హైహీల్స్ తొడిగే ఫ్రీక్వేన్సీ ఎంత తగ్గితే మీకు దాని వలన వచ్చ నొప్పులు అంత తగ్గుతాయి.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments