Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయిల్ పాలిష్ అప్పుడప్పుడు మగవాళ్లు కూడా వేస్కుంటే?

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (13:03 IST)
స్త్రీలకు ముఖచర్మం ఎంత అందంగా ఉంటుందో అదే విధంగా గోర్లు కూడా అంతే అందంగా ఉండాలని వారి భావన. దానికోసమనే గోర్లను పెద్ద పెద్దవిగా పెంచుకుంటారు. కానీ, ఆ గోర్లకు నెయిల్ పాలిష్ ఎలా పెట్టుకోవాలో తెలియదు. అందుకోసం బ్యూటీ పార్లకు వెళ్తుంటారు. ఈ చిన్న విషయానికే పార్లకి వెళ్లవలసిన అవసరం లేదు. ఇంట్లో నెయిల్ పాలిష్ ఎలా అలంకరించుకోవాలో చూద్దాం..
 
1. ముందుగా గోర్లను నెయిల్ రిమూవర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పాలిష్‌ బ్రష్‌ను గోర్ల ముందు భాగంలో పెట్టి ఎడమ, కుడి వైపుగా పాలిష్ వేసుకుంటూ.. మధ్య భాగంలోనికి రావాలి. 
 
2. గోర్ల రంగు పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ దూదిని పక్కనే ఉంచుకోవాలి. ఎందుకంటే నెయిల్ పాలిష్ వేసేటప్పుడు వేళ్ల చివర్లల్లో అంటుకుంటుంది. దానిని అప్పుడే తుడిచేయాలి.. లేదంటే ఎండిపోతుంది.
 
3. ఒక్కోసారి నెయిల్ పాలిష్ బ్రష్‌తో పెట్టడానికి చాలామందికి వీలుకాదు. అలాంటప్పుడు పెదాలకు వాడే బ్రష్‌ని కూడా వాడొచ్చు. ఒకవేళ ఆ బ్రష్‌నే ఉపయోగిస్తే.. 5 నిమిషాల్లో పెట్టే పాలిష్ 20 నిమిషాల వరకు కొనసాగుతుంది.
 
4. కొందరైతే ముందుగా పెట్టుకున్న పాలిష్‌ను శుభ్రం చేయడానికి రిమూవర్ కూడా ఉపయోగించరు. అలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే.. మీరు పెట్టే పాలిష్ అందంగా కనిపించాలంటే.. ఆ గోర్లపై ఎలాంటి మరకలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే పాలిష్ పెట్టేందుకు వీలుకాదు.     
 
5. పాలిష్ అందానికి ఎలా ఉపయోగపడుతుందో.. ఆరోగ్యానికి కూడా అంతే ఉపయోగపడుతుంది.. ఎలా అంటే.. నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వలన గోర్లలోని సూక్ష్మక్రిములు నశించిపోతాయి. అంతేకాకుండా గోర్లలోని చెడు బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. కనుక అప్పుడప్పుడు మహిళలే కాదు పురుషులు కూడా నెయిల్ పాలిష్ వేసుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments