Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగాకు టీతో.. థైరాయిడ్ సమస్య మటాష్

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (12:57 IST)
థైరాయిడ్‌కు మునగాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మన శరీర పనితీరుపై హార్మోన్ల ప్రభావం చాలానే ఉంటుంది. ముఖ్యంగా మన గొంతుభాగంలో ఉండే థైరాయిడ్‌ గ్రంథికి మేలు చేయాలంటే.. మునగాకును ఆహారంలో చేర్చుకోవాలి.


గొంతుభాగంలో వుండే థైరాయిడ్ గ్రంథి పని తీరులో తేడాల వల్ల థైరాయిడ్‌ సమస్య ఎదురవుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి ''హైపో థైరాయిడిజం''. ఈ రోజుల్లో దీని బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని అదుపులో ఉంచాలంటే వైద్యులు సూచించిన మాత్రలతోపాటు ఆహారపరంగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
అందుకే మునగాకుతో చేసే వంటకాలను తీసుకోవాలి. మునగాకుతో రొట్టెలు, తాలింపు వంటివి వారానికి మూడుసార్లైనా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మునగాకు రెండు గ్లాసుల నీటిలో బాగా ఉడికించి ఆ నీటిని వడగట్టి రోజూ గ్లాసుడు తీసుకుంటే థైరాయిడ్ సమస్య దరిచేరదు. పాల‌క‌న్నా అనేక రెట్లు ఎక్కువ క్యాల్షియం మ‌న‌కు మున‌గాకు ద్వారా ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్ల‌ల‌కు మంచిది. 
 
దంతాలు దృఢంగా త‌యార‌వుతాయి. మున‌గాకులో ప్రోటీన్లు కూడా ఎక్కువే ఉంటాయి. మాంసం తిన‌నివారు మున‌గ ఆకుల‌తో కూర చేసుకుని తింటే దాంతో శ‌రీరానికి ప్రోటీన్లు బాగా ల‌భిస్తాయి. రోజుకి ఐదు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు క్రమంగా తీసుకుంటే రక్తపోటు సమస్య వుండదని.. మ‌ధుమేహం ఉన్న వారికి మున‌గాకు చ‌క్క‌ని ఔష‌ధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని అలీ.. కారణం శివాజీయేనా?

జైలులో భర్త.. భర్త తమ్ముడితో పెళ్లి.. ఏడు నెలల పసికందు హత్య.. ఎలా?

వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

తెలంగాణలో అత్యధికంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రెండు భాగాలు, మూడు పాత్రల టీనేజ్ లవ్ స్టోరీతో ఎస్ కే ఎస్ క్రియేషన్స్ చిత్రం

సమంత, రాజ్ & డికె లాంచ్ చేసిన అనుపమ పరమేశ్వరన్ 'పరదా' ఫస్ట్ లుక్

ఆడ పిల్లనే అయితే ఏంటట ? అంటూ ప్రశ్నిస్తున్న పోలీస్‌ఆఫీసర్‌ చాందిని చౌదరి యేవమ్‌ లుక్‌

తర్వాతి కథనం
Show comments