Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నెలు తోమి తోమి చేతులు ఇలా మారాయి..? ఏం చేయాలి..?

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (14:03 IST)
సాధారణంగా చాలామంది ముఖంపై ముడతలు పడుతుంటాయి. కానీ, ఇప్పటి కాలంలో చేతుల పైన కూడా ముడతలు పడుతున్నాయి. అందుకు కారణాలు వాటిని పట్టించుకోకపోవడమే. ముఖం చర్మానికి అందం ఎంత ముఖ్యమో చేతి వేళ్ల అందం కూడా అంతే ముఖ్యమని చెప్తున్నారు. మరి అందానికి గల చిట్కాలు పరశీలిద్దాం...
 
వెన్న పాల ఉత్పత్తులలో ఒకటి దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికే కాదు చర్మానికి కూడా మంచిగా దోహదపడుతాయి. వెన్నలో కొద్దిగా బాదం నూనె కలుపుకుని రాత్రివేళ చేతులకు మర్దన చేసుకోవాలి. మరునాడు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మానికి కావలసిన విటమిన్ ఈ అందుతుంది. దాంతో చర్మం మృదువుగా మారుతుంది. చేతులు సున్నితంగా కనిపిస్తాయి. 
 
ఎలాంటి చర్మతత్వం ఉన్నా.. చేతులు ఎక్కువగా నీళ్ళల్లో ఉంచడం అంత మంచిది కాదు. గిన్నెలు తోమి, దుస్తులు ఉతికే వారు రోజు తప్పనిసరిగా చేతులకు గ్లవుజులు వేసుకోవాలి. లేదంటే చర్మం చెడు రసాయనాల ప్రభావానికి లోనై  బరకగా మారుతుంది. కొన్ని సార్లు తోలు కూడా రాలే అవకాశం ఉంది.. కనుక జాగ్రత్త వహించండి..
 
ఉడికించిన గుడ్డు చెడు కొలెస్ట్రాల్‌ని ఎలా తగ్గిస్తుందో.. పచ్చి గుడ్డు కూడా చేతి వేళ్లను అంతగా శుభ్రం చేస్తుంది. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి చేతులకు మర్దన చేసుకోవాలి. ఆ తరువాత పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే చేతులు ముడతలు తొలగిపోయి మృదువుగా మారుతాయి. 
 
గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో చేతులను మర్దన చేసుకోవాలి. వీలైతే కాసేపు ఆ నూనెలోనే చేతులను నాననివ్వాలి. ఇలా చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. దాంతో చర్మం రంగు కోల్పోకుండా ఉంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments