దీపావళి రోజున తలంటు స్నానానికి వేడి నీరు తప్పనిసరి.. సమయం?

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (17:12 IST)
దీపావళి పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేయాలి. నువ్వుల నూనెను తలకు, శరీరానికి, పట్టించి అభ్యంగన స్నానమాచరించి కొత్త దుస్తులు ధరించాలి. దీపావళి రోజున సూర్యోదయానికి ముందే ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల్లోపూ అభ్యంగన స్నానం చేసేయాలని పండితులు చెప్తున్నారు. తలంటు స్నానం కోసం వేడినీటిని ఉపయోగించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
దీపావళి రోజున ఉదయం చేసే అభ్యంగన స్నానాన్ని పవిత్ర గంగాస్నానంతో పోల్చుతారు. ఆరోజున ఇంటి బావి వద్ద లేదా నదుల వద్ద స్నానం చేయడం ద్వారా పవిత్ర గంగలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. 
 
వికారినామ సంవత్సరం 27 అక్టోబర్ 2019, ఆదివారం పూట, చతుర్థి తిథి, చిత్త నక్షత్రంతో కూడిన శుభ దినాన  ఉదయం 4.30 గంటల నుంచి 6.00 గంటల్లో తైల స్నానం, అభ్యంగన స్నానం చేసేందుకు సమయం ఉత్తమంగా వుందని పండితులు చెప్తున్నారు. 
 
అలాగే ఉదయం 7.00 గంటలకు పైగా 8 గంటల్లోపు శుక్ర హోరలో దీపావళి పండుగకు సంబంధించిన పూజను చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. అదే రోజున సర్వ అమావాస్య కేదార గౌరీ వ్రత పూజను సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోపు గురు హోరలో లక్ష్మీ కుబేర పూజను చేయడం ఉత్తమ ఫలితాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

తర్వాతి కథనం
Show comments