శాంసంగ్ గెలాక్సీ ఎస్9పై రూ.32 వేల డిస్కౌంట్ ఆఫర్

సోమవారం, 21 అక్టోబరు 2019 (18:54 IST)
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ప్రకటించగా, ఈ ఆఫర్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ సేల్ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బిగ్ స్క్రీన్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ రాయితీలను ప్రకటించింది.
 
ముఖ్యంగా, భారతీయ స్టేట్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు పది శాతం తక్షణ రాయితీ లభించనుంది. అలాగే, ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో కొనుగోలు చేసినా అదనంగా 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది.
 
ఇకపోతే, ఈ సేల్‌లో మిగతా స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఫోన్‌పై అత్యధిక రాయితీ లభించనుంది. దీని అసలు ధర రూ.62,500 కాగా, ఇప్పుడు దీనిని 29,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే.. ఏకంగా రూ.32,501 డిస్కౌంట్‌ను ప్రకటించింది.
 
అంతేకాకుండా, ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కింద రూ.14,000 లభిస్తుందని ఫ్లి‌ప్‌కార్ట్ పేర్కొంది. గెలాక్సీ ఎస్9లో శాంసంగ్‌కు చెందిన ఎగ్జినోస్ 9810 చిప్‌సెట్‌ను ఉపయోగించింది. 4జీబీ ర్యామ్, 12 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 23న దక్షిణకోస్తాంధ్ర మీదగా అల్పపీడనం