Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజు ఉప్పు నింపిన గాజు సీసాను అక్కడ పెడితే? (video)

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (15:15 IST)
ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనం తినే పదార్థాలలో చిటికెడు ఉప్పు కలిస్తే ఎంతో రుచి వస్తుంది. అదేవిధంగా ఉప్పు మన జీవితాలను కూడా సుఖమయం చేస్తుంది. ఉప్పుతో దిష్టి తీయవచ్చు. ఇది అందరికీ తెలిసిందే. మీకు గాని, మీ ఇంట్లో వాళ్ళకు గాని దిష్టి తగిలినట్లు అనిపిస్తే కొద్దిగా ఉప్పును తీసుకుని ఉప్పు తగిలిన వారిపై మూడుసార్లు తిప్పి దిష్టి తీసి పడేస్తారు. 
 
స్నానం చేసే గదిలో ఒక మూల ఉప్పును పెడితే వాస్తు దోషం ఉండదు. అలాగే క్రిమికీటకాలు కూడా పోతాయి. రాహువు వలన వచ్చే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే రాహువుకు ఇష్టమైన ఉప్పును గాజు బౌల్‌లో వేసి పెడితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండదు. మనస్సులో ఏదైనా ఆందోళనగా ఉంటే గట్టి ఉప్పును తీసుకొని ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దాన్ని ఇంట్లో ముఖ ద్వారానికి కట్టాలి. ఇలా చేస్తే ఆందోళన తొలగిపోతుంది. అంతే కాదు వ్యాపార స్థలంలోను, బీరువాలో కూడా ఈ మూటను పెట్టుకోవచ్చు. అలా చేస్తే వ్యాపారంలో మంచి లాభం వస్తుంది.
 
పడుకునే ముందు చిటికెడు ఉప్పు నీళ్లలో వేసి కాళ్లు, చేతులు కడుక్కుంటే మంచి నిద్ర పడుతుంది. పిల్లలకు వారానికి ఒకసారి ఉప్పును కలిపిన నీటితో స్నానం చేస్తే రోగాలు ఎక్కువగా రావు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దీపావళి రోజున ఉప్పు నింపిన సీసాను ఇంట్లో ఏదో ఒక మూల గాని, స్నానాల గదిలోగాని పెడితే నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని విశ్వాసం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments