Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 21 : అంతర్జాతీయ శాంతి దినోత్సవం.. మీ వంతుగా ఏం చేస్తారు?

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (08:41 IST)
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం మేరకు 1982 సెప్టెంబరు 21వ తేదీ నుంచి అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ప్రతి యేటా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పౌర సమాజంలో కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన పెంపొందించేలా దీన్ని నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 
 
ఈ శాంతి దినోత్సవం రోజున కపోతాలు (తెల్లని పావురాలు) ఎగురవేసి శాంతిపట్ల తమకున్న విశ్వాసాన్ని ప్రపంచ దేశాల అధినేతలు తెలియజేస్తున్నారు. ప్రపంచంలో ఎలాంటి అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా శాంతియుత జీవనానికే ప్రజానీకం మొగ్గు చూపాలని వారు పిలుపునిస్తుంటారు.
 
అదేసమయంలో పౌర సమాజంలో ప్రతి వ్యక్తి, సంస్థలు, దేశాలు ప్రపంచ శాంతి కోసం తమ వంతు ప్రయత్నాలు, ఆచరణీయ కార్యక్రమాలు ఈ రోజున నిర్వహిస్తుంటారు. దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ శాంతికోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచానికి శాంతిని ప్రబోధించేలా శాంతి గంటను మోగిస్తారు. 
 
1981లో సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా కోస్టారికా ఒక తీర్మానం సమర్పించింది. దాని ప్రకారం ఏటా సెప్టెంబర్ 21వ తేదిన ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అధికారికంగా ప్రటించింది. 
 
ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒడంబడికపై సంతకాలు జరిగిన 50వ సంవత్సరం 2008 సెప్టెంబర్ 21వ తేది కూడా చరిత్రలో నమోదైంది. ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో డెస్మండ్ టూటూ చేసిన కృషిని గుర్తించిన జేమ్స్ మాడిసన్ యూనివర్శిటీలోని మహాత్మా గాంధీ ప్రపంచ స్థాయి అహింసా కేంద్రం ఆయనకు పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది. 
 
ఈ శాంతి దినోత్సవాన్ని ఎవరైనా, ఎక్కడైనా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవచ్చు. కొవ్వొత్తి వెలిగిస్తే చాలు. మౌనంగా కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేసినా చాలు. సహోద్యోగులు, వివిధ సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు దీన్ని నిర్వహించి శాంతి అవశ్యకతను ప్రజలకు చక్కగా వివరించవచ్చు. 
 
అందరూ ఆనందంతో ఉంటే ఆ దేశం ప్రగతికి చిహ్నంగా, విజయానికి మారుపేరుగా ఉంటుంది. శత్రుత్వం ద్వేషాన్ని పెంచి, చుట్టుపక్కల వారి మధ్య కలహాలతో మనశ్శాంతి, సుఖశాంతులు కరవవుతాయ. సమాజాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రతి ఒక్కరూ ఆనందంతో, స్నేహభావంతో మెలిగితే ఏ దేశమైనా ఆనందనందనం అవుతుంది. అందుకే ప్రతి యేడాది శాంతి దినోత్సవాన్ని క్రమం తప్పకుండా ప్రపంచం నలువైపులా జరుపుకుంటుంటారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments