Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

ఐవీఆర్
మంగళవారం, 27 మే 2025 (19:34 IST)
రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా పీఠం ఎక్కిన దగ్గర్నుంచి డొనాల్డ్ ట్రంప్ ఎన్నారైల పైనే టార్గెట్ పెట్టినట్లు కనిపిస్తోంది. వీసాలకు సంబంధించిన నిబంధనలను అత్యంత కఠినతరంగా మార్చేసారు. అక్కడ కూడా భారతీయులు దొరక్కపోవడంతో ఇక లాభం లేదనుకున్నారో ఏమోగానీ ఏకంగా కళాశాల క్లాసులు ఎగ్గొడితే వీసాలు రద్దు చేస్తామని కొత్త నియమాన్ని తెచ్చేసారు. ట్రంప్ వరస చూస్తుంటే అమెరికా నుంచి ఇండియన్స్ ను ఎలాగోలా ఇంటికి... అంటే తిరిగి భారతదేశానికి పంపించాలని కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది. ఇందులో భాగంగానే ఆయన ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
 
అమెరికాలో రెండో అతిపెద్ద ఎన్నారై కమ్యూనిటీగా ఇండియన్స్
అమెరికాలో రెండో అతిపెద్ద ఎన్నారై కమ్యూనిటీగా భారతీయులు వున్నారు. తొలిస్థానంలో మెక్సికన్లు వుండగా ఆ తర్వాతి స్థానంలో భారతీయులు వున్నారు. మెక్సికోకి చెందిన వారు కోటి మంది వుండగా, భారతదేశ మూలాలు కలిగినవారు 50 లక్షల మంది వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024 నాటికి 5.4 మిలియన్లకు పైగా భారతీయులు USAలో నివసిస్తున్నారు. వారిలో 3.3 మిలియన్లకు పైగా భారతీయ సంతతికి చెందినవారు. ఈ ప్రకారంగా అమెరికన్ల జనాభాలో ఇండియన్లు 6%గా వున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు దేశ అంతర్గత భద్రత విషయంలో ఎలాంటి అనుమానం వచ్చినా ఎన్నారైలకు సంబంధించి వీసాలను రద్దు చేయవచ్చంటూ తాజాగా మరో వార్త కూడా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments