Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ఆస్తుల విలువ విప్రో, నెస్లో, ఓన్జీజీసీ కంటే అధికం!!

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (09:48 IST)
కలియుగ వైకుంఠంగా భక్తులతో నీరాజనాలు అందుకుంటున్న శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైవున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇటీవల ఓ కీలక ప్రటన చేసింది. టిటిడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ శ్వేతపత్రంలో మొత్తం ఆస్తుల వివరాలను వెల్లడించింది.
 
ఇందులో డబ్బుల రూపంలో 24 బ్యాంకుల్లో డిపాజిట్లు ఉండగా, రెండు బ్యాంకుల్లో బంగారాన్ని డిపాజిట్ చేసినట్టు తెలిపింది. భారతీయ స్టేట్ బ్యాంకులో సెప్టెంబరు 30వ తేదీ నాటికి 9818.38 కిలోల బంగారం బంగారం నిల్వలు ఉన్నాయి. అలాగే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో సెప్టెంబరు 30వ తేదీ నాటికి 438.99 కిలోల బంగారం డిపాజిట్ చేసివుంచారు. 
 
ఇకపోతే నగదు డిపాజిట్లలో ఎస్.బి.ఐలో రూ.5358.11 కోట్లు ఉండగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.1694.5 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.1839.36 కోట్లు, కెనరా బ్యాంకులో రూ.1351 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ.1006.20 కోట్లు, హెచ్‌డీఎఫ్సీలో రూ.2122.85 కోట్లు, పబంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.660.43 కోట్లు, పంజాబ్ సింధ్ బ్యాంకులో రూ.306.31 కోట్లు ఉన్నాయి. 
 
అలాగే, ఇండియన బ్యాంకులో రూ.25.30 కోట్లు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులో రూ.99 కోట్లు, యునైటెడ్ కమర్షియల్ బ్యాంకులో రూ.18 కోట్లు,  ఐఓబీలో రూ.101 కోట్లు చొప్పున మొత్తం రూ.15938 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఐటీ దిగ్గజం కంపెనీ విప్రో, ప్రభుత్వ రంగ సంస్త ఓఎన్జీసీ, ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే కంటే టిటిడీ ఆస్తుల విలువ అధికం కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments