Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యంత సంపన్న హిందూ పుణ్యక్షేత్రం ఏది?

Advertiesment
venkateswara swamy
, మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (08:54 IST)
కలియుగం వైకుంఠంగా భక్తులతో నీరాజనాలు అందుకుంటున్న తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం దేశంలోనే అత్యంత సంపన్న హిందూ పుణ్యక్షేత్రంగా పేరు గడించింది. ఈ దేవస్థానానికి దేశ వ్యాప్తంగా 960 ఆస్తులు ఉన్నాయి. ఎకరాల్లో విస్తరించివున్న ఆస్తులు వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదేకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆస్తుల విలువ రూ.85 వేల కోట్లుగా ఉండొచ్చని ఆయనత వెల్లడించారు. అలాగే, నిత్యం కోట్ల రూపాయల అర్జనతో ఈ ఆలయం అత్యంద ధనిక బోర్డు ఆలయంగా ఖ్యాతి గడించింది. 
 
దేశ వ్యాప్తంగా ఉన్న 960 ఆస్తుల విలువ రూ.85,705 కోట్లు అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 1974 నుంచి 2014 మధ్య వివిధ ప్రభుత్వాల హయాంలో టీటీడీ దేశవ్యాప్తంగా 113 ఆస్తులను వదులుకుందని వివరించారు. అయితే 2014 నుంచి ఇప్పటివరకు టీటీడీ ఏ ఒక్క ఆస్తిని కూడా వదులుకోలేదని వెల్లడించారు. 
 
తన నేతృత్వంలోని గత టీటీడీ బోర్డు క్రమం తప్పకుండా శ్వేతపత్రాలు విడుదల చేయాలన్న తీర్మానం చేసిందని వైవీ తెలిపారు. ఈ క్రమంలో గతేడాది తొలి శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. రెండో శ్వేతపత్రం వివరాలను కూడా టీటీడీ వెబ్ సైట్లోకి అప్‌లోడ్ చేస్తున్నామని వివరించారు. 
 
భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ ఆలయ ట్రస్టు ఆస్తులను పరిరక్షించే దిశగా పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రపంచ హిందూ దేవాలయాల్లో అత్యంత ధనిక బోర్డుగా కొనసాగుతున్న టీటీడీకి వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ.14 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. 14 టన్నుల బంగారం నిల్వలు కలిగివుందని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండుగ వేళ రూ.1000 కోట్ల ఫోన్లు అమ్మిన మొబైల్ కంపెనీ ఏది?